ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు నిత్యం వాడీ వేడీగా ఉంటున్నాయి. ఇక్కడ ఉన్న విధంగా హాట్ రాజకీయాలు దేశంలోని మరే రాష్ట్రంలోనూ కనిపించవు. ఇక్కడ అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీల మధ్య నిత్యం మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇలా ఇరు పార్టీల మధ్య ఓ రేంజ్ లో వారు నడుస్తున్న సమయంలో గత కొన్నిరోజుల నుంచి నెల్లూరు జిల్లా కేంద్రం మరో రాజకీయ రణరంగం జరుగుతోంది. అదే నెల్లూరు జిల్లాలోని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎపిసోడ్. ఆయన ఇటీవల తన ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ సొంతపార్టీపైనే తిరుగుబాటు చేశారు. ఆ తరువాత అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అయితే నెల్లూరు జిల్లాలోని వైసీపీలో జరుగుతున్న ఈ గొడవలు అదే పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేకు అనుకూలం అవుతున్నాయనే వార్తలు వినిపిస్తోన్నాయి. మరి.. ఆ ఎమ్మెల్యే ఎవరు? సొంత పార్టీలో గొడవలు ఆయనకు ఏ విధంగా ప్లస్ అవుతున్నాయి. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ మోహన్ రెడ్డి “గడప గడపకు మన ప్రభుత్వం” అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గం పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలను కలిసి ప్రభుత్వ పథకాల గురించి తెలియజేయాలి. అంతేకాక ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు ఏస్ధాయిలో నిర్వహిస్తున్నారనే దానిపై కూడా సీఎం జగన్ ప్రత్యేక రిపోర్టు తయారు చేశారు. పనితీరు సరిగ్గా లేని ఎమ్మెల్యేలకు హెచ్చరికలు కూడా జారి చేశారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో వెనుకబడిన నియోజవర్గాల ఎమ్మెల్యేలను మారుస్తాను అంటూ హెచ్చరికలు సైతం జారీ చేశారు. అలాంటి వారిలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. వైసీపీ అధికారం వచ్చిన నాటి నుంచి ప్రజల్లో వ్యతిరేకత పెరిగిన ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఒకరని విమర్శలు ఉన్నాయి.
ఆయన అనుచరుల్లో ఒకరు షాడో ఎమ్మెల్యేగా వ్యహరిస్తూ, అవినీతికి పాల్పడుతున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాక కావలిలో జరిగిన వివిధ రకాల ఘటనల్లో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి పేరు బలంగా వినిపించింది. గతంలో ఎన్నడు లేనంత వ్యతిరేకతను కావలి ఎమ్మెల్యే మూటగట్టుకున్నారని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇసుక మాఫియా, ప్రభుత్వ భూములను ఆక్రమించాడంటూ అనేక రకాల ఆరోపణలు ఆయనపై వచ్చాయి. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కూడా ఆయన ఉన్న వ్యతిరేకత స్పష్టంగా కనబడింది.
ఇలాంటి తరుణంలో రాబోయే ఎన్నికల్లో ప్రతాప్ కుమార్ రెడ్డికి కావలి సీటు ఇవ్వరని వార్తలు వచ్చాయి. ఆయన స్థానంలో ఆదాల ప్రభాకర్ రెడ్డిని వైసీపీ అభ్యర్ధిగా నిలబెడతారని వార్తలు వినిపించాయి. అయితే ఇలాంటి తరుణంలో నెల్లూరులో జరుగుతున్న వివాదాలు ఆయనకు అనుకూలంగా మారాయనే వార్తలు వస్తున్నాయి. కావలి అభ్యర్ధిగా ఆదాలను ఎంపిక చేయలనే తరుణంలో అనుహ్యంగా నెల్లూరు రూరల్ కి ఇన్ ఛార్జిగా ఆయనను వైసీపీ నియమించింది. అంతేకాక ఇటీవల నెల్లూరు జిల్లాలోని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి వంటి కొందరు ఎమ్మెల్యే..తమ ప్రభుత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి తరుణంలో ఉన్న ఎమ్మెల్యేలను చేజారకుండా వైసీపీ అధినాయకత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈక్రమంలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో తొలగించాలనే ఆలోచనను విరమించినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాక కావలి వైసీపీ అభ్యర్ధిగా వస్తాడనుకున్న ఆదాల.. నెల్లూరు గ్రామీణంకి వెళ్లడంతో ప్రతాప్ కుమార్ రెడ్డికి లైన్ క్లియర్ అయినట్లు గుస్సగుస్సలు వినపిస్తోన్నాయి. మరి.. ఇలా నెల్లూరు జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి అనుకూలంగా ఉన్నాయని వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.