ఏపీలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే తెలుగు కాంపోజిట్ పేపర్ చిత్తూరు జిల్లాకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్‌లో ప్రత్యక్షమైనట్లు తెలుస్తోంది. ఉదయం 9 గంటలకు తెలుగు పరీక్ష ప్రారంభమైతే.. 9గంటల57 నిమిషాలకు పరీక్ష పత్రం వాట్సాప్ గ్రూప్‌లో కనిపించడంతో కలకలంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న అధికారులు ఒక్కసారిగా షాక్ కు గురై అప్రమత్తం అయ్యారు.
ఇది కూడా చదవండి: తన పూర్వజన్మ అమ్మనాన్నల వద్దకు వెళ్లిపోతున్నానంటూ బాలుడు అదృశ్యం!
ఇదే విషయాన్ని వెంటనే జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించి చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డికి డీఈవో పురుషోత్తంకు ఫిర్యాదు చేశారు. ప్రశ్నాపత్రాన్ని ఎవరో కావాలనే సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేశారని అన్నారు. ఇక పేపర్ లీక్ ఎక్కడ జరిగిందో తమకు తెలియదని.. వెంటనే ఆరా తీశామని తెలిపారు. విద్యార్థులు ఎవరూ కూడా వదంతులు నమ్మొద్దని కలెక్టర్ సూచించారు. పదో తరగతి పరీక్ష పేపర్ లీకైన అంశం తాజాగా జిల్లాలో కలకలంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.