ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ తర్వాత రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మంత్రి పదవి దక్కలేదన్న అసహనంతో.. ఇప్పటికే మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. మరి కొందరు కూడా ఇదే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. చాలా మంది మంత్రి పదవి కోసం ఆశించినా.. అందరికి అవకాశం లభించలేదు. దీనిపై కొందరు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తుండగా.. మరి కొందరి పరిస్థితి మాత్రం.. కక్కలేక.. మింగలేక అన్నట్లుగా ఉంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఏపీ ప్రజలు ఓ ఎమ్మెల్యేపై తెగ సానుభూతి చూపిస్తున్నారు. పాపం దురదృష్టం అంటే ఇదే అంటూ విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ఎవరా ఎమ్మెల్యే.. ఆయనకు ఏం జరిగింది వంటి వివరాలు తెలియాలంటే.. ఇది చదవండి.
మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న వారి జాబితా మీడియాలో వచ్చిన సంగతి తెలిసిందే. ప్రారంభంలో ఈ జాబితాలో.. మడకశిరి ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి పేరు ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగింది. అనూహ్యంగా మంత్రి పదవి వరించడంతో.. ఆయన సుడి తిరిగింది అని తిప్పేస్వామి అనుచరులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఆ ఆనందం ఎంతో సేపు ఉండలేదు. గంటల వ్యవధిలోనే మంత్రివర్గ జాబితా నుంచి ఆయన పేరు తొలగించారు. తిప్పేస్వామికి మంత్రివర్గంలో చోటు దక్కినట్లే దక్కి.. దూరమయ్యింది. ఆయన స్థానంలో ప్రకాశం జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేష్‌కు మరోసారి మంత్రివర్గంలో స్థానం దక్కింది.
ఇది కూడా చదవండి: షాకింగ్: జబర్దస్త్ జడ్జీ పోస్ట్ నుంచి రోజా అవుట్!
నిజానికి మంత్రుల తుది జాబితాలో ఆదిమూలపు సురేష్ పేరును కూడా చేర్చారు. అయితే ప్రకాశం జిల్లాకు చెందిన తాజా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి.. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో.. ఆదిమూలపు సురేష్ పేరును జాబితా నుంచి తొలగించారు. సురేష్ స్థానంలో ఆయన బావ, మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామికి చోటు కల్పించారు. దీంతో తిప్పేస్వామికి మంత్రి పదవి ఖరారైందంటూ జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఇంతలోనే జాబితా నుంచి తిప్పేస్వామి పేరును పక్కనపెట్టేశారు.
ప్రకాశం జిల్లా నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఉండట్లేదనే కారణంతో తిరిగి ఆదిమూలపు సురేష్ పేరునే జాబితాలో చేర్చారు. దీంతో చివరి నిమిషంలో తిప్పేస్వామికి మంత్రి పదవి చేజారినట్లు అయింది. బావ, బావమరుదుల మధ్య దోబూచులాడిన మంత్రి పదవి చివరకు బావమరిది ఆదిమూలపు సురేష్‌నే వరించింది. దీనిపై తిప్పేస్వామి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.