ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ కు నాన్ బెయిలబు అరెస్టు వారెండ్ జారీ అయింది. విశాఖ ఆరో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కమ్ రైల్వే న్యాయస్థానం నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
ఏపీ పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ కు నాన్ బెయిలబు అరెస్టు వారెండ్ జారీ అయింది. విశాఖపట్నంలోని ఆరో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కమ్ రైల్వే న్యాయస్థానం నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మంత్రితో పాటు రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ ఛైర్మన్ జాన్ వెస్లీకి కూడా న్యాయస్థానం నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. మంత్రి అమర్ నాథ్ కు ఏ కేసు విషయంలో కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. ఆ పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…
2018 ఏప్రిల్ 11న అప్పుడు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న గుడివాడ అమర్ నాథ్ తో పాటు మళ్ల విజయ ప్రసాద్ , కోలా గురువులు, జాన్ వెస్లీ, కొయ్య ప్రసాద్ రెడ్డి, పీవీ సురేష్, వంశీ కృష్ణ, ఉషాకిరణ్ తదితర వైకాపా నాయకులతో కలిసి ప్రత్యేక హోదా , రైల్వే జోన్ ఏర్పాటుకు డిమాండ్ చేస్తూ విశాఖపట్నంలోని రైల్వే స్టేషన్ లోకి అనధికారికంగా ప్రవేశించారు. ఆ సమయంలో విశాఖ- పలాస ప్యాసింజర్ రైలును కొంత సమయమం నిలిపివేసి రైల్ రోక్ నిర్వహించారు. దీంతో అప్పట్లో వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.
ఈ క్రమంలో విచారణలో భాగంగా వీరందరిని ఫిబ్రవరి 27 న్యాయస్థానం ముందు హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశించారు. అయితే విచారణకు గుడివాడ అమర్ నాథ్ , జాన్ వెస్లీ మినహా నిందితులందరూ కోర్టు హాజరయ్యారు. అయితే మంత్రి అమర్ నాథ్, జాన్ వెస్లీలు న్యాయస్థానం ఆదేశించినప్పటికీ హాజరు కాకపోవడటంతో వారికి నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. న్యాయస్థానం కేసు తదుపరి విచారణను మార్చి 7వ తేదీకీ వాయిదా వేసింది. మరి.. మంత్రి అమర్ నాథ్ కు కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.