ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ కు నాన్ బెయిలబు అరెస్టు వారెండ్ జారీ అయింది. విశాఖ ఆరో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కమ్ రైల్వే న్యాయస్థానం నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
జయప్రద.. అందం, అభినయం రెండింటి కలబోత. కొన్న ఏళ్ల పాటు.. టాలీవుడ్‌ని తన అందం, నటనతో ఊర్రుతలుగించింది. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి.. ఇలా అందరితో నటించింది. టాలీవుడ్‌లోనే కాక.. బాలీవుడ్‌లో కూడా రాణించింది జయప్రద. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. అక్కడ కూడా విజయం సాధించింది. ఈ శుక్రవారం ఆహాలో ప్రసారం కాబోయే బాలయ్య అన్‌స్టాపబుల్ షోకి జయప్రద గెస్ట్‌గా వచ్చిన ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా జయప్రదకు సంబంధించి […]
సీనియర్ హీరో, యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్, జీవిత దంపతులు తమను మోసం చేశారంటూ జోస్టర్ ఫిలిం సర్వీసెస్ సభ్యులు మీడియాను ఆశ్రయించారు. సినిమా నిర్మాణం కోసం తీసుకున్న రూ.26 కోట్లు ఇవ్వటం లేదని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నగరి కోర్టు జీవితా రాజశేఖర్‌కి షాకిచ్చింది. ఆమెపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. చెక్ బౌన్స్ కేసులో తమకు న్యాయం చేయాలంటూ జోస్టర్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నగరి కోర్టును ఆశ్రయించారు. […]
బీజేపీ ఫైర్‌బ్రాండ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో ఆయనపై నాంపల్లి కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. గతంలో టీఆర్ఎస్ ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లను చించివేయడం.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ని దుర్బాషలాడిన కేసు విచారణ చేపట్టిన ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం.. ఈ కేసులో ఎంపీ అరవింద్ విచారణకు హాజరుకాని కారణంగా నాన్‌బెయిల్‌బుల్ వారెంట్ జారీ చేసింది. కేసేంటంటే.. 2020 నవంబర్ 23వ […]
ఏపీలో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు అరెస్టు సంచలనం కలిగిస్తోంది. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజును ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 124 ఐపీసీ-ఏ సెక్షన్ కింద రఘురామరాజుపై నాన్ బెయిలబుల్ కేసు ఫైల్ చేశారు. ప్రభుత్వ, ముఖ్యమంత్రి ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆయనను అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా ఏపీ సర్కార్‌పై, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై రఘురామరాజు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సీఎం జగన్, సజ్జల, […]