సీనియర్ హీరో, యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్, జీవిత దంపతులు తమను మోసం చేశారంటూ జోస్టర్ ఫిలిం సర్వీసెస్ సభ్యులు మీడియాను ఆశ్రయించారు. సినిమా నిర్మాణం కోసం తీసుకున్న రూ.26 కోట్లు ఇవ్వటం లేదని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నగరి కోర్టు జీవితా రాజశేఖర్‌కి షాకిచ్చింది. ఆమెపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. చెక్ బౌన్స్ కేసులో తమకు న్యాయం చేయాలంటూ జోస్టర్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నగరి కోర్టును ఆశ్రయించారు.
ఇది కూడా చదవండి: వీడియో: నటి రోజా పై జీవిత సెటైరికల్ కామెంట్స్!
గతంలో జీవితా రాజశేఖర్ తమకు రూ.26 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఎగ్గొట్టారని, ఆమె ఇచ్చిన చెక్స్ బౌన్స్ అయ్యాయని హేమ పేర్కొన్నారు. ఒకే ఆస్థిని జీవితా రాజశేఖర్ ఇద్దరికి అమ్మారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో చెక్ బౌన్స్ కేసుని పరిశీలించిన నగరి న్యాయస్థానం జీవితకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేశారు.
ఇది కూడా చదవండి: మనం చచ్చిపోతాం..మంట పెట్టేస్తారు-జీవిత,రాజశేఖర్ ఎమోషనల్ఇక తనపై వస్తున్న ఈ ఆరోపణలపై జీవితా రాజశేఖర్ స్పందించారు. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, శనివారం ఆధారాలతో సహా శేఖర్ సినిమా ప్రెస్‌మీట్‌లో తాము మీడియా ముందు అసలు విషయాన్ని చెబుతామని జీవితా రాజశేఖర్ తెలిపారు. రాజశేఖర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ శేఖర్ మే 20న విడుదలకు సిద్ధమైంది. ఈ సమయంలో జీవితా రాజశేఖర్‌పై ఆర్థిక పరమైన ఇబ్బందులున్నట్లు వార్తలు రావటం, ఆమెపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ కావటం గమనార్హం. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.