ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారు సంక్రాంతి పండగను ఎంతో ఘనంగా ప్రారంభించారు. భోగి మంటలు, రంగ వల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్లు, పైరు పచ్చల కళకళలు గ్రామాల్లో సంక్రాంతి శోభను తీసుకువచ్చాయి. మూడు రోజుల ఈ పండుగలో మొదటి రోజు భోగి ఉత్సవాలలో సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరూ ఎంతో ఉత్సహంగా పాల్గొంటున్నారు. భోగి వేడుకలలో పాల్గొన్న రాజకీయ, సినీ ప్రముఖులు రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ భోగి వేడుకల్లో సినీ, రాజకీయ ప్రముఖులు స్టెప్పులలతో హోరెత్తిస్తున్నారు. ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు భోగి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ అందరిని ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సత్తెనపల్లి ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు స్థానికులతో కలిసి భోగి వేడుకల్లో పాల్గొన్నారు. అంతేకాక పాటలకు డ్యాన్స్ వేస్తూ సందడి చేశారు. బంజారా మహిళలతో నృత్యం చేస్తూ భోగి మండల చుట్టూ రాంబాబు తిరిగారు. ఆయన గతంలోనూ సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. గత ఏడాది సత్తెనపల్లిలో జరిగిన సంక్రాంతి పండగ కార్యక్రమాల్లో అంబటి రాంబాబు పాల్గొన్ని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జనసేన నాయకులకు అంబటి రాంబాబు టార్గెట్ గా మారారు. జనసేన నేతలు నిత్యం అంబటిపై విరుచుపడుతున్నారు. మంత్రి రాంబాబు కూడా అదే స్థాయిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సమాధానాలు ఇస్తున్నారు. ఇలాంటి హాట్ రాజకీయాలను అలా పక్కన పెట్టి.. సత్తెనపల్లిలో స్థానికులతో కలసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు.
స్థానికులతో కలిసి ఎంతో సంతోషంగా భోగి వేడుకను అంబటి రాంబాబు జరుపుకున్నారు. కొందరు మహిళలతో కలిసి బంజారా డాన్స్ చేసారు. అంబటి రాంబాబు స్టెప్పులతో హోరెత్తించారు. మంత్రి డ్యాన్స్ వేస్తున్న సమయంలో అక్కడి యువత కేరింతలు కొడుతూ ఉత్సాహపరిచారు. డప్పు కళాకారులు, బంజారాలతో కలిసి భోగి మంటల చుట్టూ డాన్స్ లు చేస్తూ మంత్రి సందడి చేశారు. మంత్రి డ్యాన్స్ చేస్తున్న సమయంలో యువత తమ కెమెరాలకు పనిచెప్పారు. అంబటి డ్యాన్స్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో సైతం పోస్ట్ చేశారు. భోగి వేడుకల్లో పాల్గొన్న మంత్రి అంబటి రాంబాబు.. ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకలో పాల్గొనటం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. తనకు తోడుగా ప్రజలు, వారికి తోడుగా జగనన్న సంక్షేమ పథకాలు ఉన్నాయన్నారు. అంబటి రాంబాబు వేసిన డాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలువురు ఆయనను ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. మంత్రి డ్యాన్స్ వీడియోను మీరు వీక్షించి.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.