ఏపీ మంత్రి అంబటి రాంబాబుకు కోర్టు షాకిచ్చింది. సత్తెనపల్లి పోలీసులు.. కోర్టు ఆదేశాల మేరకు అంబటిపై కేసు నమోదు చేశారు. అంబటి రాంబాబుపై ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యూలేషన్ స్కీమ్ నిషేధ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సత్తెనపల్లి పోలీసులు తెలిపారు. మంత్రి అంబటి రాంబాబు పేరు మీద వైసీపీ నేతలు.. సంక్రాంతి పండుగ సందర్భంగా సంక్రాంతి లక్కీ డ్రా నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనిపై జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన […]
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారు సంక్రాంతి పండగను ఎంతో ఘనంగా ప్రారంభించారు. భోగి మంటలు, రంగ వల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్లు, పైరు పచ్చల కళకళలు గ్రామాల్లో సంక్రాంతి శోభను తీసుకువచ్చాయి. మూడు రోజుల ఈ పండుగలో మొదటి రోజు భోగి ఉత్సవాలలో సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరూ ఎంతో ఉత్సహంగా పాల్గొంటున్నారు. భోగి వేడుకలలో పాల్గొన్న రాజకీయ, సినీ ప్రముఖులు రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ […]
మంత్రి అంబటి రాంబాబుపై తక్షణమే కేసు నమోదు చేయాలంటూ గుంటూరు జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సంక్రాంతి సందర్భంగా టికెట్ల పేరిట వసూళ్లకు పాల్డుతున్నారంటూ వచ్చిన ఆరోపణలపై ఈ ఆదేశాలు జారీ చేసింది. సత్తెనపల్లిలో సంక్రాంతి పేరిట లక్కీ డ్రాలు నిర్వహిస్తున్నారని జనసేన నేతలు ఆరోపణలు చేశారు. పోలీసుల దృష్టికి తీసుకెళ్తే వారు కేసు నమోదు చేయలేదని ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు తీసుకోలేదనే కోర్టుకి వెళ్లామంటున్నారు. జనసేన నేతలు గుంటూరు జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఈ […]
ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాక మంత్రి అంబటి రాంబాబు మీద కొందరు సంచలన ఆరోపణలు చేశారు. కుమారుడు చనిపోయినందుకు ప్రభుత్వం తమకు ఇచ్చిన పరిహారంలో మంత్రి అంబటి రాంబాబు వాటా అడిగారంటూ ఇద్దరు భార్యాభర్తలు ఆరోపించడం సంచలనంగా మారింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకు బాధితులు ఎవరు.. ప్రభుత్వం ఎందుకు వారికి పరిహారం అందించింది వంటి వివరాలు.. ఈ ఏడాది ఆగస్టు నెల 20వ తేదీన సత్తెనపల్లి పట్టణంలోని ఓ రెస్టారెంట్‌లో సెప్టిక్ […]
ఈ రోజుల్లో ప్రేమించి పెళ్లి చేసుకున్న అనేక మంది దంపతుల కాపురాలు మధ్యలో నిట్టనిలువున కూలిపోతున్నాయి. కాదు కాదు.. కూల్చేసుకుంటున్నారు. వివాహేతర సంబంధాల కారణంగా కొందరు హత్యలు, ఆత్మహత్యలు చేసుకుంటుంటే.., వరకట్న వేధింపుల కారణంగా మరికొందరు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. అచ్చం ఇలాగే ఓ భర్త ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అనుమానంతో చంపేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన ఏపీలో చోటు చేసుకుంది. ఇదే ఘటన ఇప్పుడు […]