గత కొన్ని రోజులుగా సినిమా టికెట్ల వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుని వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను మొన్న హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ కొట్టివేసిన విషయం తెలిసిందే. ఏపీలో పాత పద్ధతిలోనే టికెట్ల అమ్మకాలు జరగాలని ఆ సందర్భంగా హైకోర్టు తెలిపింది.
హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును సవాలు చేస్తూ సినిమా టికెట్ల ధరలపై డిజివిన్ బెంచ్‌లో ఏపీ ప్రభుత్వం అప్పీల్ చేయడంతో ఈ రోజు విచారణ జరిగింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ తమ వాదనలను వినిపించారు. ఇవాళ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఉన్న కమిటీలో లోటు పాట్లను సరి చేసి కొత్త కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇదీ చదవండి : తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదల!
ఇక టిక్కెట్ల ధరల జాబితాను జాయింట్ కలెక్టర్‌కు పంపించాలని థియేటర్ యజమానులకు సూచించింది న్యాయస్థానం.. టిక్కెట్ల ధరలకు అనుగుణంగా పన్నులు చెల్లించాలని థియేటర్ యజమానులను ధర్మాసనం ఆదేశించింది. అంతేగాక, టికెట్ల ధరల నిర్ణయంపై ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.