ఏదైనా ప్రత్యేక కార్యక్రమాల సందర్భంగా వచ్చే అతిథులకు ప్రత్యేక వంటకాలతో.. మర్చిపోలేని విందు ఏర్పాటు చేస్తాం. మరి ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమం అందునా దేశ, విదేశాల ప్రతినిధులు హాజరయ్యే కార్యక్రమం అంటే.. ఇక అరెంజ్‌మెంట్స్ ఏం రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విశాఖ వేదికగా జరుగుతున్న జీఎస్‌ఐ 2023 సదస్సు కోసం ప్రభుత్వం ప్రత్యేక వంటకాలను అతిథులకు వడ్డించనుంది. ఆ వివరాలు
ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం వేదికగా వైసీపీ ప్రభుత్వం నిర్వహిస్తోన్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఘనంగా ప్రారంభం అయ్యింది. మార్చి 3-6 వరకు మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సదస్సుకు దేశ, విదేశాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు. సదస్సు ప్రారంభం రోజున అనగా శుక్రవారం నాడు సుమారు 26 దేశాల నుంచి 15 వేల మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. 21 మంది పారిశ్రామికవేత్తలు ప్రసంగించనున్నారు. ఈ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని.. సుమారు 6 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు సీఎం జగన్ తన ప్రసంగంలో వెల్లడించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహిస్తోన్న తొలి ఇన్వెస్టర్స్ సదస్సు కావడంతో.. ప్రభుత్వం.. సకల సదుపాయాలు కల్పించనుంది. సమ్మిట్‌కు హాజరయ్యేవారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసింది.
ఇక దేశ, విదేశాల నుంచి వచ్చే అతిథుల కోసం ప్రభుత్వం నోరురించే వంటకాలను సిద్ధం చేయిస్తోంది. ఏపీలోని మూడు ప్రాంతాల్లో ఫేమస్ రుచులను.. సదస్సుకు వచ్చిన వారికి రుచి చూపించబోతున్నారు. వెజ్, నాన్ వెజ్‌కి సంబంధించి పలు రకాల వంటకాలు సిద్ధం చేశారు. తొలిరోజు మధ్యాహ్నం అనగా.. శుక్రవారం నాడు లంచ్‌లో బొమ్మిడాయిల పులుసు, గుంటూరు కోడి వేపుడు, రొయ్యల మసాల కర్రీ, మటన్ కూర, చికెన్ పలావ్ పెట్టనుండగా.. వెజ్‌లో పుట్టగొడుగులు, క్యాప్పికం, ఆలూ గార్లిక్ ఫ్రై, క్యాబేజీ మటర్ ఫ్రై, వెజ్ పలావ్, రోటీ, కుల్చా, పన్నీర్ బటర్ మసాలా, మెంతికూర-కార్న్ రైస్, మిర్చి కా సలాన్, టమాటా పప్పు, స్వీట్స్, ఐస్‌క్రీంలు ఏర్పాటు చేశారు.
శనివారం లంచ్‌లో రష్యన్ సలాడ్స్, వెజ్ సలాడ్స్‌లతో పాటు, రుమాలి రోటీ, బటర్ నాన్, ఆంధ్రా చికెన్ కర్రీ, చేపల ఫ్రై, గోంగుర రొయ్యల కూర, ఎగ్ మసలా, మటన్ పలావ్, వెజ్‌లో పలు రకాల వెరైటీలు వీటితో పాటు స్వీట్స్, ఐస్‌క్రీంలు ఏర్పాటు చేయనున్నారు. ఇక సమ్మిట్‌కు పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు తరలి వస్తుండటంతో.. వారి కోసం హెలికాప్టర్లు, లగ్జరీ కార్లను ఏర్పాటు చేయనున్నారు. సమ్మిట్ కోసం ఇప్పటి వరకు సుమారు 12 వేలకు పైగా రిజిస్ట్రేషన్స్ జరిగాయంటే.. సమ్మిట్‌కు భారీ స్పందన లభిస్తోందని అర్థం అవుతోంది అంటున్నారు వైసీపీ మంత్రులు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.