మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారి ఖాతాల్లో రూ. 15 వేల చొప్పున జమ చేయనుంది. ఆర్థికంగా వెనుకబడి ఉన్న మహిళలకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఏపీ ప్రభుత్వం సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పటికే అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, రైతు భరోసా వంటి పథకాలను అమలు చేస్తున్న జగన్ సర్కార్ జనవరి నెలలో మరో పథకాన్ని తీసుకొచ్చింది. అదే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం. ఈ పథకంలో భాగంగా 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న పేద మహిళలకు రూ. 45 వేల ఆర్థిక సహకారాన్ని అందజేస్తారు. ఈ నెల 12న వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకాన్ని అమలు చేయనున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఏపీ సీఎం జగన్ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. బటన్ నొక్కి మహిళల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. రెడ్లు, కమ్మ, ఆర్య, వైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమ, ఓసీ సామాజిక వర్గానికి చెందిన ఆర్థికంగా వెనుకబడి ఉన్న మహిళలకు ఈ పథకం వర్తిస్తుంది.
ఈ పథకానికి సంబంధించిన ఇప్పటికే అర్హులను గుర్తించిన ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించి ఫైనల్ జాబితాను విడుదల చేసింది. గ్రామ, వార్డు సచివాలయంలో ఈ జాబితాను అందుబాటులో ఉంచింది. ఏ నెల 12న ఈ పథకానికి సంబంధించి నిధులను విడుదల చేయనుంది. 4 లక్షల 60 వేల 20 మందిని లబ్ధిదారులుగా గుర్తించింది ప్రభుత్వం. మొత్తం 8,85,567 దరఖాస్తులు రాగా 8,70,239 దరఖాస్తులు మాత్రమే అప్డేట్ అయ్యాయి. 15,328 దరఖాస్తులు అప్డేట్ కాలేదు. 98.27 శాతం అప్డేట్ అయ్యింది. ఎవరైనా ఇంకా అప్డేట్ చేయించుకోలేని వారు ఉంటే వెంటనే మీ వివరాలు, ధ్రువీకరణ పత్రాలు సచివాలయంలో ఇచ్చి అప్డేట్ చేయించుకోండి. ఈ జాబితాలో 4,60,020 మందిని అర్హులుగా గుర్తించగా, 4,10,366 మందిని అనర్హులుగా గుర్తించారు.