కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. మహమ్మారికి విరుగుడు టీకానే అని ప్రభుత్వం భారీ ఎత్తున ప్రచారం చేస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున టీకాలు పంపిణీ చేస్తున్నారు. తాజాగా వైరస్ పిల్లలపై కూడా ప్రభావం చూపుతుండటంతో.. యువతకు కూడా వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు. 15-17 ఏళ్ల లోపు టీనేజర్లకు వ్యాక్సిన్ పంపిణీ కొనసాగతుంది. ఇక యువతకు వ్యాక్సిన్ ఇచ్చే విషయంలో ఏపీ రికార్డు సృష్టించింది. 99 శాతం టీకా పంపిణీతో దేశంలోనే నంబర్ 1గా నిలిచింది ఏపీ. మిగిలిన 1 శాతం పూర్తి చేస్తే.. యువతకు 100 శాతం టీకా వేసిన రాష్ట్రంగా ఏపీ నిలుస్తుంది. యువతకు వ్యాక్సినేషన్ కార్యక్రమం ఏ రాష్ట్రంలో ఎలా ఉందో వివరిస్తూ.. మై గవ్ పోర్టల్ ఓ నివేదిక విడుదల చేసింది.
ఇది కూడా చదవండి : కరోనా వ్యాక్సిన్ చేసిన వండర్! పక్షవాతం మాయమైంది.. మూగ వ్యక్తి మాట్లాడుతున్నాడు!
దీనిలో 99 శాతం వ్యాక్సిన్ పంపిణీ పూర్తితో ఏపీ ప్రథమ స్థానంలో ఉండగా.. 84 శాతంతో హిమాచల్ ప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. తెలంగాణలో యువతకు వ్యాక్సినేషన్ కార్యక్రమం 66 శాతం పూర్తయ్యింది. ఇక 17 శాతంతో మేఘాలయ చివరి స్థానంలో ఉంది.
ఇది కూడా చదవండి : ఎనిమిది సార్లు వ్యాక్సిన్ వేయించుకున్నాడు! మరో సారికి..