ఏపిలో ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగులు నిన్న నిర్వహించిన ‘చలో విజయవాడ’ ఊహించిన దానికి మించి విజయవంతమైంది. ఉద్యోగస్తులు ఉప్పెనలా తరలి వచ్చారు.. పోలీసుల నిర్బంధాన్ని ఛేదించుకుని లక్షలాదిమంది ఉద్యోగులు విజయవాడ తరలివచ్చి తమ సత్తా చాటారు. అయితే ఉద్యోగుల నిరసనపై ప్రభుత్వం తీరుని ఎండగడుతున్నారు ప్రతిపక్ష నేతలు. అంతే కాదు నిన్నటి ర్యాలీతో ఉద్యోగస్తులు ఒక రకంగా పైచేయి సాధించారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపి ముఖ్యమంత్రి తీవ్ర అసహనంలో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పీఆర్సీ వ్యవహారం, ఉద్యోగులు సమ్మెపై క్యాంప్ కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి.
ఇది చదవండి : జగన్ కి సజ్జల అంటే ఎందుకంత నమ్మకం..?
సీఎంతో పాటు మంత్రులు బుగ్గన, బొత్స, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల కూడా హాజరయ్యారు. ప్రభుత్వ సీఎస్ సమీర్ శర్మ కూడా సమావేశానికి హాజరయ్యారు. ఉద్యోగులు చేపట్టిన పెన్ డౌన్, యాప్స్ డౌన్ పై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. సోమవారం నుంచి ఉద్యోగులు సమ్మెకు వెళ్తున్న క్రమంలో ఉద్యోగులపై ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపై సమీక్షించే అవకాశం ఉంది. ఉద్యోగులు సమ్మెకు వెళ్తున్న క్రమంలో తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించే అవకాశం ఉంది. ఉద్యోగులు పీఆర్సీ, హెచ్ ఆర్ పై సమీక్షిస్తున్నట్లుగా సమాచారం. అంతే కాదు పాలన స్తంభిస్తే ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలనే దానిపై సమాలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే మంత్రి బొత్స, సజ్జల ఉద్యోగులకు సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు.