ఏపిలో ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగులు నిన్న నిర్వహించిన ‘చలో విజయవాడ’ ఊహించిన దానికి మించి విజయవంతమైంది. ఉద్యోగస్తులు ఉప్పెనలా తరలి వచ్చారు.. పోలీసుల నిర్బంధాన్ని ఛేదించుకుని లక్షలాదిమంది ఉద్యోగులు విజయవాడ తరలివచ్చి తమ సత్తా చాటారు. అయితే ఉద్యోగుల నిరసనపై ప్రభుత్వం తీరుని ఎండగడుతున్నారు ప్రతిపక్ష నేతలు. అంతే కాదు నిన్నటి ర్యాలీతో ఉద్యోగస్తులు ఒక రకంగా పైచేయి సాధించారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపి ముఖ్యమంత్రి తీవ్ర అసహనంలో […]