ఏపి ముఖ్యమంత్రి వైయస్. జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నంచి వర్చువల్ గా కొత్త జిల్లాలను ప్రారంభించారు. ఇప్పటి వరకు ఏపిలో 13 జిల్లాలు కాస్తా 26 జిల్లాలుగా ఏర్పడ్డాయి. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో కొన్ని వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ప్రతిపక్షాలు అసలు ఈ జిల్లాల ఏర్పాటు ఏ మాత్రం శాస్త్రీయంగా లేవని అంటున్నారు. సీఎం సొంత నిర్ణయానుసారంగా జిల్లాల ఏర్పాటు జరిగిందని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. గత కొంత కాలంగా తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చిరకాల డిమాండ్ నేరవేర్చారు ముఖ్యమంత్రి జగన్.
ఏపిలో జిల్లా పెంపుతో రెవెన్యూ డివిజన్ల సంఖ్య 72కి పెరిగింది.. ఈ నేపథ్యంలో చంద్రబాబు నియోజకవర్గం కుప్పం కూడా రెవెన్యూ డివిజన్ చేశారు. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. గత పద్నాలు ఏళ్లుగా చేయలేని ఒక పని తమ పరిపాలనో జరిగిందని.. కుప్పంను కూడా రెవెన్యూ డివిజన్ గా చేశామని అన్నారు. ఇప్పటి వరకు చంద్రబాబు ఈ సాహసం చేయలేకపోయారని ఎద్దేవా చేశారు.