వృద్దాప్య పెన్షన్ దారులకు రాష్ట్ర ప్రభుత్వం తిపి కబురును అందించింది. ఏపీలోని వృద్దాప్య పెన్షన్ లను 2250 నుంచి 2500 వరకు పెంచుతూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే తాజాగా పెంచిన ఈ వృద్దాప్య పెన్షన్ ను వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇదిలా ఉంటే 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెన్షన్ ను రూ. 3000 వరకు పెంచుతామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం 61,72,964 మంది పెన్షన్ తీసుకుంటున్నట్లు ప్రభుత్వ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే తాజాగా సీఎం జగన్ తాజా నిర్ణయంతో పెన్షన్ దారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం పెంచిన వృద్దాప్య పెన్షన్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.