ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఉపాధ్యాయులకు ముఖ ఆధారిత హాజరు నమోదును ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. 9 గంటలకు ఒక్క నిమిషం ఆలస్యమైనా సెలవు కిందకి పరిగణించేలా యాప్ ను సిద్ధం చేశారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వ టీచర్ల నుంచి తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తమైంది. దీంతో ఫేస్ రికగ్నిషన్ హాజరు విషయంలో తాజాగా ఏపీ ప్రభుత్వం కొంత సడలింపు ఇచ్చింది. 9 గంటలకు మరో 10 నిమిషాల గ్రేస్ సమయాన్ని ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంటే, ఉపాధ్యాయులు 9.10 గంటలలోపు ఫేస్ రికగ్నిషన్ ద్వారా హాజరు వేసుకోవచ్చు. అలాగే, మరికొన్ని సడలింపులు కూడా ఏపీ ప్రభుత్వం ఇచ్చింది.
నెట్ వర్క్ సమస్యల కారణంగా యాప్ పనిచేయని సందర్భంలో ఆఫ్ లైన్ ద్వారా నమోదుచేసే అవకాశాన్ని కల్పించనున్నట్లు వెల్లడించింది. అలానే ఆండ్రాయిడ్ ఫోన్ మరచిపోతే.. తమ తోటి ఉపాధ్యాయుల లేదా ప్రధానోపాధ్యాయుల స్మార్ట్ ఫోన్ లోనూ హాజరు నమోదుకు అవకాశం మిచ్చింది. డిప్యూటేషన్, శిక్షణకు వెళ్లినప్పుడు ఆన్ డ్యూటీలో ఉన్నవారికి ప్రత్యేక లీవ్ మాడ్యూల్ ను ఈ నెల 25 నుంచి అమలు చేయనుంది. టీచర్లు, ప్రధానోపాధ్యాయులు సెలవుల వివరాల్ని కూడా యాప్ లోనే అప్ డేట్ చేయాలని విద్యాశాఖ ఉన్నా అధికారులు వెల్లడించారు.మొదటగా ఫైలెట్ విధానంలో ఈ నెలాఖరు వరకు యాప్ లో హాజరు నమోదును కొనసాగిస్తామని, ఇప్పటికీ యాప్ రిజిస్ట్రేషన్ చేసుకోనివారు వెంటనే పూర్తి చేయాలని అధికారులు స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల విషయంలో తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంపలో తెలియజేయండి.
ఇదీ చదవండి: పలాస పర్యటనలో ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో నారా లోకేష్!
ఇదీ చదవండి: ఏపీ మంత్రి రోజా ఇంట్లో బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు! ఫోటోలు వైరల్..