టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ పలాస పర్యటన తీవ్ర ఉద్రిక్త నెలకొంది. ఆముదాలవలస మండలం కొత్త రోడ్డు వద్ద పోలీసులు లోకేషన్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలాస- కాశిబుగ్గ 27వ వార్డు శ్రీనివాస్ నగర్ కాలనీలో టీడీపీ కౌన్సిలర్ గురిటి సూర్యనారాయణ అన్యాయం జరిగిందని.. ఆయనతో పాలు మరో 50 మంది బాధితులను పరామర్శించడానికి వస్తున్న నేపథ్యంలో లోకేష్ ను అరెస్టు చేశారు పోలీసులు. నిరసనలో పాల్గొనేందుకు వస్తున్న నారా లోకేష్ పాటుగా ఇతర టీడీపీ ముఖ్య నేతలను అరెస్ట్ చేశారు. తమను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని రోడ్డుపై నిరసనకు దిగారు. విషయం తెలుసుకున్న శ్రీకాకుళం టీడీపీ నేతలు అక్కడకు చేరుకొని పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇది అక్రమ అరెస్ట్ అని మండిపడ్డారు. టీడీపీ నేతలు, కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు. పర్యటనకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంపై మండిపడ్డారు. ఆ సమయంలో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో పలువురు కార్యకర్తలు, నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. లోకేశ్‌తో పాటు చినరాజప్ప, కళా వెంకట్రావు మరి కొంత మందిని అదుపులోకి తీసుకొని ఎచ్చెర్ల సమీపంలోని జేఆర్ పురం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. Nara Lokesh: శ్రీకాకుళం హైవేపై నారా లోకేశ్‌ను అడ్డుకున్న పోలీసులు..#Naralokesh #TdP #protest #srikakulam #palasa #eenadu #Telugunews pic.twitter.com/WLvVe3Gi2K — Eenadu (@eenadulivenews) August 21, 2022 ఇది చదవండి: పవన్ కల్యాణ్ పేరిట మాల దీక్ష! ట్రెండ్ అవుతున్న పాత వీడియో!