ఒమిక్రాన్ యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పుడు ఒమిక్రాన్ కేసు ఏపీలోనూ నమోదు అయ్యిందనే వార్తలు వినగానే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ సైతం ధ్రువీకరించింది. విజయనరం జిల్లాలో ఈ కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో ఈ వేరియంట్ వెలుగు చూసినట్లు తెలిపారు. అతను ఐర్లాండ్ నుంచి విజయనగరం వచ్చినట్లు వెల్లడించారు.
Andhra Pradesh reported first #Omicron case; 34-year-old came from Ireland, tested -ve in RT-PCR at Mumbai, travelled to #Vizag where he tested +ve; genome sequencing at #CCMB revealed OmicronVariant; patient had no symptoms, tested -ve yday #FirstOmicronInAP @ndtv @ndtvindia pic.twitter.com/YbOqZDnj51
— Uma Sudhir (@umasudhir) December 12, 2021
అతను ముంబయి విమానాశ్రయంలో కరోనా పరీక్ష చేయించుకోకుండా వచ్చినట్లు అధికారులకు సమాచారం ఇచ్చారు. అతని ముంబయిలో దిగి పరీక్షలు చేయించుకోకుండా తిరుపతి వెళ్లినట్లు.. అక్కడి నుంచి నేరుగా శృంగవరపుకోటకు చేరుకున్నట్లు తెలిపారు. అతను నాలుగురోజుల క్రితం వచ్చినట్లు చెప్పారు. ముంబయి అధికారుల సమాచారంతో అతనికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా తేలింది. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం హైదరాబాద్ పంపగా ఒమిక్రాన్ పాజిటివ్ గా తేలినట్లు అధికారులు ధ్రువీకరించారు. అతనికి 34 సంవత్సరాలు ఉంటాయి.
#NewsAlert | #AndhraPradesh reports first case of ‘Omicron’ variant in the state.
Sowmith with more details. | #OmicronInIndia pic.twitter.com/AjuSXhQw7B
— TIMES NOW (@TimesNow) December 12, 2021