Andhra Pradesh Cabinet Dissolved: ఏపీ కేబినేట్ చివరి సమావేశం ముగిసింది. సమావేశం అనంతరం మంత్రి వర్గం మొత్తం రాజీనామాలు చేసింది. 24 మంది మంత్రులు తమ రాజీనామాల లేఖలను సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి అందించారు. ఆ తర్వాత వారి,వారి సొంత వాహనాల్లో ఇంటికి వెళ్లిపోయారు. మంత్రుల రాజీనామా లేఖలు మరి కొద్ది సేపట్లో గవర్నర్ ముందుకు వెళ్లనున్నాయి. అయితే, కీలక మంత్రులైన కొడాలి నాని, బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి వారు రెండో సారి కూడా మంత్రి పదవుల్లో కొనసాగుతారనే వార్తలకు చెక్ పడింది.
అయితే, అనుభవం, కుల సమీకరణల రీత్యా ప్రస్తుతం రాజీనామా చేసిన వారిలో కొంతమందిని మళ్లీ కేబినేట్‌లోకి తీసుకునే అవకాశం ఉంది. 5-6 మంది మరోసారి మంత్రులుగా కొనసాగే అవకాశం ఉంది. వీరిలో సదరు కీలక నేతలు ఉంటారా? లేదా అన్నది వేచిచూడాల్సిందే. ఇక, మంత్రి పదవులు దక్కని వారికి పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఈ నెల 11వ తేదీన కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది.రాజీనామా అనంతరం కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ అనుభవరీత్యా కొంతమందిని మరోసారి మంత్రులుగా కొనసాగించే అవకాశం ఉందని సీఎం చెప్పారు. కొనసాగే వారిపేర్లు సీఎం చెప్పలేదు. ఐదారుగురు మంత్రులు కొనసాగే అవకాశం ఉంది. కొత్త క్యాబినేట్‌లో నేను ఉండే అవకాశం తక్కువ. సీఎం జగన్ ఏ బాధ్యతలు ఇచ్చినా తీసుకుంటాం ’’ అని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి : సీఎం జగన్ కోసం తల కోసుకోవడానికైనా సిద్ధమే!!- మంత్రి ఆదిమూలపు సురేష్
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.