ఆంధ్రప్రద్రేశ్ ప్రభుత్వం కానిస్టేబుల్ అభ్యర్ధుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. కానిస్టేబుల్ ఉద్యోగులకు రెండేళ్లపాటు వయోపరిమితి పెంచుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే ఏపీ ప్రభుత్వం పోలీస్ రిక్రూట్ మెంట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే వయో పరిమితి నిబంధన విషయంలో పలువురు అభ్యర్థులు అభ్యతరం వ్యక్తం చేశారు. కొందరు వయోపరిమితిని పెంచాలంటూ సీఎం జగన్, ఇతర అధికారులను విజ్ఞప్తి చేశారు. వారి వినతి మేరకు సీఎం జగన్ సానుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. వయోపరిమితి సడలింపునకు సీఎం జగన్ అంగీకరించారు. పోలీస్ రిక్రూట్ మెంట్ విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై కానిస్టేబుల్ అభ్యర్ధుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీ ప్రభుత్వం పోలీసు నియమాకాల ప్రక్రియ చేపట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా అక్టోబర్ లో పోలీస్ శాఖ 6,511 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో 411 ఎస్సై పోస్టులు , 6100 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయి. ఇక ఎస్సై పోస్టులో 315 సివిల్, 96 ఏపీఎస్పీ పోస్టులు ఉన్నాయి. అలానే 6,100 కానిస్టేబుల్ ఖాళీల్లో 3,580 సివిల్, 2,520 ఏపీఎస్పీ పోస్టులు ఉన్నాయి. పోస్టుకు రెండు విభాగాల్లో దరఖాస్తు చేయాలనుకునే వారు ఒక దరఖాస్తు చేస్తే సరిపోతుంది. అయితే ఈ నోటిఫికేషన్ లో ఇచ్చిన వయోపరిమితి విషయంలో అభ్యర్ధుల నుంచి తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వచ్చాయి.
ఈ నోటిఫికేషన్ లో ఇచ్చిన వయోపరిమితిని రెండేళ్లకు పెంచాలంటూ ప్రభుత్వానికి కానిస్టేబుల్ అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. వయో పరిమితిని పెంచి తమకు కూడా అర్హత కల్పించాలంటూ అభ్యర్ధులు చేసిన వినతులపై సీఎం అధికారులతో సమావేశమయ్యారు. ఈక్రమంలో వారి వినతిపై సీఎం జగన్ సానుకూల నిర్ణయం తీసుకున్నారు. వయోపరిమితి సడలింపునకు సీఎం జగన్ అంగీకరించారు. ఈ నోటిఫికేషన్ విషయంలో రెండేళ్లపాటు వయోపరిమితి పెంచుతూ చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయంతో చాలామంది ఈ ఉద్యోగాల కోసం పోటీ పడేందుకు అవకాశం లభిస్తోంది