ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న ‘పుష్ప’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. ‘ఆర్య, ఆర్య 2’ చిత్రాల తర్వాత హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం హ్యాట్రిక్ చిత్రం ఇది .రష్మిక మందాన్నా హీరోయిన్ నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగానే అంచనాలున్నాయి.
తమ అభిమాన హీరో చిత్రాన్ని వీక్షించేందకు ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహ పడ్డారు. తాజాగా అనంతపురం జిల్లా హిందూపురంలో అల్లు అర్జున్ అభిమానులు రచ్చ చేశారు. ఈ సినిమా హిందూపురంలోని బాలాజీ థియేటర్ లో విడుదలైంది. అయితే బెనిఫిట్ షో వేస్తామంటూ థియేటర్ యాజమాన్యం ఒక్కొక్కరి నుంచి రూ. 500 వసూలు చేసింది.
ఇదీ చదవండి : పుష్ప మూవీ రివ్యూ
ఇక బెనిఫిట్ షో చూసేందుకు ఎంతో సంతోషంతో అభిమానులు థియేటర్ వద్దకు వచ్చారు. అయితే వారికి తీవ్ర నిరాశ ఎదురైంది. థియేటర్ యాజమాన్యం బెనెఫిట్ షో వేయలేదు. దీంతో బన్నీ అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.. థియేటర్ పై రాళ్లు రువ్వి రచ్చ రచ్చ చేశారు.
థియేటర్ల యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు అభిమానులను చెదరగొట్టి, అక్కడి నుంచి పంపించేశారు. థియేటర్ గేట్లను మూసివేశారు. ఇదిలా ఉంటే.. ఇటీవల బెనిఫిట్ షోలను వేయకూడదంటూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసిన సంగతి తెలిసిందే.