స్టార్ హీరోయిన్ విడాకుల తర్వాత జరిగిన సంఘటనల గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడింది. 'పుష్ప'లో ఐటమ్ సాంగ్ చేసే విషయమై సన్నిహితులతోనే చాలా మాటలు పడాల్సి వచ్చిందని పేర్కొంది.
స్టార్ హీరోయిన్ సమంత చెప్పగానే అద్భుతమైన సినిమాలు గుర్తొస్తాయి. లవ్ స్టోరీతో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ, కమర్షియల్ చిత్రాలతో పాటు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ యమ క్రేజ్ సంపాదించింది. ‘శాకుంతలం’గా ఏప్రిల్ 14న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ లో పాల్గొంటున్న సామ్.. తన జీవితం గురించిన ఆసక్తికర విషయాల్ని షేర్ చేసుకుంది. విడాకుల తీసుకున్న తర్వాత తనతో ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఏమేం అన్నారో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సమంత కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘ఏ మాయ చేశావె’తో హీరోయిన్ గా పరిచయమైన సమంత, ఈ మూవీలో తనతో పాటు యాక్ట్ చేసిన హీరో చైతన్యని పెళ్లి చేసుకుంది. దాదాపు నాలుగేళ్లు కలిసి ఉన్న ఈ జంట.. వ్యక్తిగత కారణాలతో 2021లో విడిపోయింది. దీంతో ఇరువురి ఫ్యాన్స్ చాలా బాధపడ్డారు. అయితే ఎందుకు విడిపోయారనేది ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉండిపోయింది. చైతూతో విడిపోవడం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ పెళ్లి తర్వాత ఎంత నిజాయతీగా ఉన్నాసరే ఆ బంధం ఎందుకో సరిగా కుదరలేదని చెప్పుకొచ్చింది. అలానే విడాకుల తీసుకున్న తర్వాత ఐటమ్ సాంగ్ ఒప్పుకొనే విషయంలోనూ చాలా పెద్ద చర్చనే జరిగిందని క్లారిటీ ఇచ్చింది.
‘విడాకులు తీసుకున్న తర్వాత వచ్చిన ఫస్ట్ ఆఫర్ ‘పుష్ప’లోని ‘ఊ అంటావా మావ’ సాంగ్. నేను ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు. అందుకే నేను ఇంట్లో ఎందుకు కూర్చోవాలి, వెంటనే ఈ సాంగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను. నా సన్నిహితులు, స్నేహితులు అయితే విడాకులు తీసుకున్న వెంటనే ఈ ఐటం సాంగ్ ఎలా ఒప్పుకుంటావ్. సినిమాలు వద్దు ఏమీ వద్దు, ఇంట్లో కూర్చో అని చెప్పారు. దీంతో ఎవరు ఏం చెప్పినా సరే పట్టించుకోవడం మానేశాను’ అని సమంత చెప్పుకొచ్చింది. మరి సామ్ వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.