నేషనల్ క్రష్, పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మికకు సర్ ప్రైజ్ గిఫ్ట్ వచ్చింది. అయితే ఆ బహుమతి ఏమో గానీ రష్మిక మాత్రం తెగ ఎమోషనల్ అయిపోయింది.
తెలుగు సినిమా రేంజు పెరిగిపోయింది. పాన్ ఇండియా వైడ్ వీళ్లని అభిమానిస్తూ ఆరాధించేవాళ్లు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. ఇంకా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా మన స్టార్స్ ని తెగ లైక్ చేస్తున్నారు. అందులో భాగంగానే హీరోహీరోయిన్లకు అప్పుడప్పుడు సర్ ప్రైజ్ గిఫ్టులు కూడా వస్తుంటాయి. అయితే ఫ్యాన్స్ ఎవరైనా సరే తమ పేరు చెప్పి, సదరు స్టార్స్ తమని గుర్తించాలని అనుకుంటూ ఉంటారు. అయితే కొన్నిసార్లు అజ్ఞాతవ్యక్తుల నుంచి అద్భుతమైన గిఫ్టులు వస్తుంటాయి. ఇప్పుడు హీరోయిన్ రష్మిక విషయంలోనూ అదే జరిగింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. హీరోయిన్ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కన్నడ సినిమాతో అది కూడా టీనేజ్ లో హీరోయిన్ గా మారిన ఈమె.. ఆ తర్వాత తర్వాత తెలుగుతో పాటు హిందీలో మూవీస్ చేసి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం వరల్డ్ వైడ్ ఈమె పాపులారిటీ విపరీతంగా పెరిగిపోయింది. నేషనల్ క్రష్ అని ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకునే ఈమెకు.. ఇప్పుడు యూకేకు చెందిన ఓ అభిమాని అద్భుతమైన బహుమతిని కొరియర్ చేశాడు. దాన్ని ఫొటో తోసి తన ఇన్ స్టా స్టోరీలో రష్మిక పోస్ట్ చేయడం విశేషం.
ఇక ఈ ఫ్లవర్ బొకే సీతాకోకచిలుక డిజైన్ లో ఉంది. దానికి తోడు.. అత్యంత ప్రేమించే ఓ అభిమాని అని తన గురించి రాసుకొచ్చాడు. ఎక్కడా కూడా తన పేరుని మెన్షన్ చేయలేదు. ఇక ఈ గిఫ్ట్ చూసి తెగ ఎమోషనల్ అయిన రష్మి.. తన హర్ట్ కరిగిపోయిందని, గిఫ్ట్ పంపిన వ్యక్తికి ‘ఐ లవ్ యూ’ కూడా చెప్పింది. ఇది చూసి చాలామంది రష్మిక ఫ్యాన్స్ గిఫ్టులు పంపించేందుకు రెడీ అయిపోతున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ‘పుష్ప 2’ షూటింగ్ తో బిజీగా ఉన్న రష్మిక.. రీసెంట్ గా హిందీలో ‘యానిమల్’ చిత్రీకరణ కంప్లీట్ చేసింది. మరి రష్మిక తనకొచ్చిన సర్ ప్రైజ్ గిఫ్ట్ చూసి ఎమోషనల్ కావడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.