ఆమె కన్నడ నటి. జస్ట్ ఐదారేళ్లలో ఆలోవర్ ఇండియా క్రేజ్ తెచ్చుకుంది. సినిమాల సంఖ్యనే కాదు ఆస్తులు కూడా గట్టిగానే పెంచేసుకుందండోయ్.. మరి ఈ విషయం మీకేమైనా తెలుసా?
హీరోయిన్ రష్మికను చాలామంది నేషనల్ క్రష్ అని పిలుస్తుంటారు. ఎందుకంటే ఏ ఒక్క భాషకు ఆమె పరిమితం కాలేదు. కన్నడతో మొదలుపెట్టి.. హిందీ వరకు వెళ్లిపోయింది. అన్ని కలిసొస్తే వేరే దేశాల్లో వేరే భాషల్లో నటించినా సరే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇలా సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ పోతున్న రష్మిక.. అదే టైంలో ఆస్తులు కూడా బాగానే పెంచేసుకున్నట్లు కనిపిస్తుంది. నెటిజన్స్ అయితే ఆమె ఆస్తులు, సంపద గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. ట్విట్టర్ లోనూ ఆమె ఫొటోలు పోస్ట్ చేసి మరీ ఇదే టాపిక్ డిస్కస్ చేస్తున్నారు. ఇంతకీ ఏంటి సంగతి?
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘కిరిక్ పార్టీ’ మూవీతో హీరోయిన్ పరిచయమైన రష్మిక, ఆ తర్వాత కన్నడలోనే పునీత్ రాజ్ కుమార్ తో కలిసి నటించింది. ‘ఛలో’ మూవీతో తెలుగులోకి వచ్చేసి.. మెల్లమెల్లగా క్రేజ్ సంపాదించింది. ‘గీతగోవిందం’, ‘పుష్ప’ మూవీస్ రష్మిక స్టార్ డమ్ అమాంతం పెరగడానికి కారణాలు అని చెప్పొచ్చు. ఇలా చాలా చిన్న ఏజ్ లో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న రష్మిక.. ఆస్తులని గట్టిగా పెంచేసుకుందని ట్విట్టర్ లో ఓ యూజర్ పోస్ట్ పెట్టాడు. దానికి రష్మిక కూడా రిప్లయి ఇవ్వడం విశేషం.
‘ఐదేళ్ల కెరీర్ లోనే రష్మిక.. హైదరాబాద్, గోవా,కూర్గ్, ముంబయి, బెంగళూరు సిటీస్ లో లగ్జరీ అపార్ట్ మెంట్స్ కొనేసింది. 2021లో బ్యాక్ టూ బ్యాక్ ప్రాపర్టీస్ పై ఇన్వెస్ట్ చేసింది’ అని ఓ పోస్ట్ లో ఉంది. అక్కడ ఇక్కడా తిరిగి ఇది రష్మిక కంట పడింది. దీన్ని చాలా పాజిటివ్ గా తీసుకున్న ఈ భామ.. ‘నిజం కావాలని కోరుకుంటున్నా’ అని రిప్లయ్ ఇచ్చింది. దీంతో నెటిజన్స్ తెగ కామెంట్స్ పెడుతున్నారు. ఎక్కడెక్కక ఇళ్లు ఉన్నాయో చెప్పు అని ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ మధ్య హీరో విజయ్ దేవరకొండతో టూర్స్ వేస్తూ మీడియా కంటపడింది రష్మిక. ఆయా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు అది కాదన్నట్లు రష్మిక ఆస్తులు గురింటి డిస్కషన్ నడుస్తోంది. మరి రష్మిక ఆస్తులు ఎన్ని కోట్లు ఉండొచ్చని మీరనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
🥲🥲I wish it were true
— Rashmika Mandanna (@iamRashmika) February 10, 2023