నేషనల్ క్రష్ రష్మిక.. పాన్ ఇండియా లెవల్లో యమ క్రేజ్ సంపాదించిన హీరోయిన్. 'పుష్ప'తో ఫ్యాన్ బేస్ ని ఓ రేంజులో పెంచేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. రోజూ తన ఇంట్లోని పనివాళ్ల పాదాల్ని మొక్కతున్నానని చెప్పుకొచ్చింది. ఇంతకీ అలా ఎందుకు చేస్తుందో తెలుసా?
స్టార్ హీరోయిన్ రష్మిక పేరు చెప్పగానే అందరికీ ‘మూడు హిట్స్ ఆరు కాంట్రవర్సీలు’ అనే సామెత గుర్తొస్తుంది. ఎందుకంటే ఇప్పటికే తెలుగు, తమిళ, కన్నడ, హిందీలో సినిమాలు చేస్తూ హిట్స్ ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తున్న ఈ బ్యూటీ.. రియల్ లైఫ్ లోనూ ఎప్పటికప్పుడూ వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంటుంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండతోనూ ఈమె రిలేషన్ గురించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటారు. అలా రష్మిక గురించి, ఆమె లైఫ్ స్టైల్ గురించి జనాలకు చాలావరకు తెలుస్తూనే ఉంది. అయినా సరే ఇప్పటివరకు ఎవరికీ చెప్పని ఓ ఆసక్తికర విషయాన్ని తాజాగా బయటపెట్టింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. హీరోయిన్ రష్మిక నిజంగా సూపర్! కన్నడలో ‘కిరిక్ పార్టీ’ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, ‘ఛలో’తో తెలుగులోకి వచ్చేసింది. ఆ తర్వాత ఆడపాదడపా సినిమాలు చేస్తూ హిట్స్ కొట్టింది. మహేష్ తో ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్ ‘పుష్ప’తో తన రేంజ్ ని అమాంతం పెరిగిపోయేలా చేసుకుంది. ఏకంగా పాన్ ఇండియా స్టార్ అయిపోయింది. ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఈ సంక్రాంతికి ‘వారసుడు’తో ప్రేక్షకుల్ని పలకరించిన రష్మిక.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన డైలీ రొటీన్ లో ఉండే ఓ క్రేజీ విషయాన్ని బయటపెట్టింది.
‘చిన్నచిన్న విషయాలు కూడా నాకు చాలా కీలకం. పెంపుడు జంతువులతో టైమ్ స్పెండ్ చేయడాన్ని కూడా నేను ఆస్వాదిస్తాను. మాటలకు నిజంగా చాలా శక్తి ఉంది. ఓ మనిషి మనసు విరిచేయడానికి ఆ మాటలు చాలు. అందుకే ఎవరేం అనుకున్నా సరే నేను దాన్ని పర్సనల్ గా తీసుకుంటాను. రోజులో జరిగే చిన్న విషయాల్ని కూడా నేను డైరీలో రాసుకుంటాను. ఇంటికొచ్చిన తర్వాత గౌరవంతో ప్రతి ఒక్కరి పాదాల్ని టచ్ చేస్తాను. నా ఇంట్లో పనివాళ్ల కాళ్లని కూడా మొక్కుతాను. నాకు మనషుల్ని వేరుచేసి చూడటం నచ్చదు. అందుకే ఇలా చేస్తున్నాను. మనిషిగా ప్రతిఒక్కరినీ గౌరవిస్తాను’ అని రష్మిక చెప్పుకొచ్చింది. మరి ఈ ముద్దుగుమ్మ వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.