అన్ని బంధాల్లో భార్యా భర్తల బంధం బలమైనది. రెండు వేర్వేరు శరీరాలు అయినప్పటికీ మనసు ఒకేలా ఆలోచిస్తుంటాయి. కష్ట సుఖాల నుండి అన్ని బాధ్యతల్లోనూ ఇద్దరూ చేదోడువాదోడుగా ఉంటారు. ఇంతటి బంధంలో ఒక్కరూ దూరమైనా.. మరొకరిలో ఆ లోటు కనిపిస్తోంది. అయితే ఓ మహిళ.. తన నుండి దూరమైన భర్తకు గుడి కట్టి పూజలు చేస్తోంది.
జీవితాంతం కలిసి ఉండాలని మూడు ముళ్లు, ఏడడుగల బంధంతో ఏకమౌతారు భార్యా భర్తలు. సుఖ, దుఖాల సమయంలో చేదోడు వాదోడుగా, తోడు నీడగా ఉంటారు. చిన్న చిన్న పొరపచ్ఛాలు వచ్చినా మళ్లీ కలుసుకుంటారు. అపార్థాలు, అనుమానాలకు తావునివ్వనంత వరకు ఈ బంధం బలపడుతూనే ఉంటుంది. చివరకు పిల్లలను ఓ మంచి మార్గం చూపించి..వారూ వృద్ధాప్య దశ అనుభవించేందుకు సిద్ధమౌతారు. అయితే ఈ బంధంలో అనుకోకుండా ఏ ఒక్కరూ తిరిగి రాని లోకాలకు వెళ్లినా.. మరొకరిపై బాధ్యతల భారం పడుతోంది. ఆ ఇంటికి వారు లేని లోటును మళ్లీ తిరిగి తీసుకు రాలేంది. ఇదే ఆలోచించిన ఓ భార్య.. తన భర్తకు ఏకంగా గుడి కట్టి పూజిస్తున్నారు.
ఈ గుడి ప్రకాశం జిల్లా పొదిలి మండటం నిమ్మ వరం గ్రామంలో ఉంది. భర్త యాక్సిడెంట్‌లో చనిపోగా.. ఆయన ప్రేమ మీద భార్య గుడి కట్టించి పూజలు చేస్తున్నారు. ఆయన ఆ ఊరికి మంచి చేయడంతో పాటు వృద్ధాశ్రమాలు కట్టాలని భావించే వాడని, భర్త అడుగు జాడల్లో నడవాలనుకున్న భార్య.. ఈ గుడి కట్టి, దీని ద్వారా సేవ చేస్తున్నట్లు తెలిపారు. ఈ గుడి కోసం సుమారు 7 లక్షలు ఖర్చు పెట్టారు. తాము ఎప్పుడు ఆధ్యాత్మిక చింతనలో ఉండేవారని, ఆయన వెంకయ్య స్వామిని పూజించేవారని, ఆయన గురువుగా మారి.. ఉపదేశాలు ఇచ్చారని చెప్పారు. తాను ఉపదేశం తీసుకున్నానని చెప్పారు. ఈ గుడి కట్టే సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు.
శని, ఆదివారాలు భక్తుల సందర్శనార్థం ఈ గుడిని తెరిచి ఉంచుతామని చెప్పారు. పౌర్ణమి, అమావాస్య అన్నదానాలు చేస్తామని తెలిపారు. ఆ గుడిని దర్శించుకోవడానికి వచ్చిన వారి కుటుంబాల్లో సమస్యలు తొలగిపోయాయని పేర్కొన్నారు. పిల్లలు లేని వాళ్లు, భార్య భర్తలు తగాదాలు సమసిపోయాయని అన్నారు. ఆయన శిష్యులు కూడా ఈ గుడి కోసం కృషి చేస్తున్నారని అన్నారు. మీ భర్త పక్కన కొంచెం స్థలం ఉంచడంపై మాట్లాడుతూ..తన భర్త మరణం తర్వాత తనకు అక్కడ ఉంచాలన్న ఉద్దేశంతో అలా చేసినట్లు చెప్పారు. తన భర్త తనకు దైవం భావించి ఈ కృషి చేస్తున్నట్లు చెప్పారు.