అన్ని బంధాల్లో భార్యా భర్తల బంధం బలమైనది. రెండు వేర్వేరు శరీరాలు అయినప్పటికీ మనసు ఒకేలా ఆలోచిస్తుంటాయి. కష్ట సుఖాల నుండి అన్ని బాధ్యతల్లోనూ ఇద్దరూ చేదోడువాదోడుగా ఉంటారు. ఇంతటి బంధంలో ఒక్కరూ దూరమైనా.. మరొకరిలో ఆ లోటు కనిపిస్తోంది. అయితే ఓ మహిళ.. తన నుండి దూరమైన భర్తకు గుడి కట్టి పూజలు చేస్తోంది.
భర్తని చంపేసిన భార్య. భర్తని మోసం చేసిన భార్య.. ఈ మధ్య కాలంలో ఇలాంటి వార్తలు ఎక్కువయ్యాయి. కానీ.., భారతీయ వైవాహిక వ్యవస్థ ఈరోజుకి ఇంత బలంగా ఉందంటే.. దానికి కారణం మాత్రం స్త్రీ జాతి అని కచ్చితంగా చెప్పుకోవాలి. అలాంటి ఓ మహా ఇల్లాలి కథ ఇది. వేద మంత్రాల సాక్షిగా మెడలో మూడు ముళ్ళు వేసిన భర్తనే దైవంగా భావిస్తూ.., భర్తకి గుడి కట్టి పూజిస్తున్న ఓ పుణ్య స్త్రీ కథ ఇది. ఆ […]