తూర్పు గోదావరి జిల్లాలోని ఓ విద్యార్థి మాస్టారుకు ఆశ్చర్యపరిచే విధంగా లేఖ రాసి అందరినీ షాక్ కు గురి చేశాడు. నేను మద్యం తాగి స్కూలుకు వస్తున్నానంటూ లేఖ రాశాడు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది జిల్లాలోని పి.గన్నవరం మండలంలోని ఓ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి మద్యం తాగి స్కూలుకు వచ్చినట్టు ఉపాధ్యాయులు గుర్తించారు.
ఇది కూాడా చదవండి: ఏపీ సీఎం జగన్‌కు షాక్! కోర్టుకి హాజరు కావాలంటూ సమన్లు!
ఈ విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులందరూ ఆ విద్యార్థి లేఖతో షాక్ కు గురుయ్యారు. ఏం చేయాలో తెలియక వెంటనే ఆ విద్యార్థి తండ్రిని స్కూలుకు పిలిపించారు. దీంతో తండ్రి కూడా ఎవరూ ఊహించని విధంగా సమాధానాలు చెప్పారు. గత కొన్ని రోజుల నుంచి మా కుమారుడు మద్యం తాగుతున్నాడని, ఎంత చెప్పినా కూడా మారటం లేదని ఎలాగైన వాడిని మీరే ఓ దారికి తీసుకురావలంటూ విజ్ణప్తి చేశాడు. తండ్రి సమాధానాలతో ఉపాధ్యాయులంతా తలలు పట్టుకున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.