ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 2016-19 మధ్య కాలంలో కాపు రిజర్వేషన్ ఉద్యమం జరిగింది. కాపు ఉద్యమంలో భాగంగా తునిలో రైలుకు నిప్పంటించిన ఘటనలో కాపులపై నమోదైన కేసులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎత్తేసింది. ఈ మేరకు గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. తుని ఘటనతో పాటు.. జనవరి 2016 నుంచి మార్చి 2019 వరకు నమోదైన 161 కేసులను ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఇది చదవండి : ఏనుగుతో చిన్నారి స్నేహం! వీడియో వైరల్
కాపు ఉద్యమం సమయంలో తూర్పుగోదావరి జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన కేసులు ఎత్తివేస్తూ హోమ్ శాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్ జీవో జారీ చేశారు.అంతేకాదు కాపు ఉద్యమంలో భాగంగా 2016 జనవరిలో నిర్వహించిన తూర్పుగోదావరి జిల్లా తుని కార్యక్రమంలో పలువురు ఆందోళనకారులు రైలుకు నిప్పుపెట్టిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన మరో 17 కేసులల్లో విచారణను ఉపసంహరించుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020లో ఉత్తర్వులు జారీ చేసింది.
ఇది చదవండి : ఎందరికో ఆదర్శం ఈ కలెక్టరమ్మ
కాగా, కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ముద్రగడ పద్మనాభం నాయకత్వంలో కాపులు పెద్ద ఎత్తున ఉద్యమించిన విషయం తెలిసిందే. ఈ ఉద్యమంలో భాగంగానే 2016 జనవరిలో తుని భారీ బహిరంగ సభ నిర్వహించారు. బహిరంగ సభలో పాల్గొన్న ఆందోళనకారుల రైలుకు నిప్పు పెట్టారు. దాంతో ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఘటనకు బాధ్యులైన వారిపై 69 కేసులను నమోదు చేసింది. ఇక ఏపిలో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసులు క్రమంగా ఉపసంహరించుకుంటూ వస్తోంది. కాపు ఉద్యమానికి సంబంధించి నమోదైన అన్ని కేసులనూ ఎత్తివేసింది.