ఐదేళ్ల క్రితం ఏపీలోని తుని ప్రాంతంలో రైలు దగ్ధమైన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కాపు ఉద్యమ జరుగుతున్న సమయంలో తుని స్టేషన్ సమీపంలో రత్నాచల్ ఎక్స్ ప్రెస్ కు కొందరు మంటలు పెట్టారు. ఈ ఘటనలో తాజాగా తుది తీర్పు వెలువడింది. కోర్టు ఇచ్చిన తీర్పుపై అందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 2016-19 మధ్య కాలంలో కాపు రిజర్వేషన్ ఉద్యమం జరిగింది. కాపు ఉద్యమంలో భాగంగా తునిలో రైలుకు నిప్పంటించిన ఘటనలో కాపులపై నమోదైన కేసులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎత్తేసింది. ఈ మేరకు గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. తుని ఘటనతో పాటు.. జనవరి 2016 నుంచి మార్చి 2019 వరకు నమోదైన 161 కేసులను ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇది చదవండి : ఏనుగుతో […]