ఐదేళ్ల క్రితం ఏపీలోని తుని ప్రాంతంలో రైలు దగ్ధమైన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కాపు ఉద్యమ జరుగుతున్న సమయంలో తుని స్టేషన్ సమీపంలో రత్నాచల్ ఎక్స్ ప్రెస్ కు కొందరు మంటలు పెట్టారు. ఈ ఘటనలో తాజాగా తుది తీర్పు వెలువడింది. కోర్టు ఇచ్చిన తీర్పుపై అందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఐదేళ్ల క్రితం ఏపీలోని తుని ప్రాంతంలో రైలు దగ్ధమైన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కాపు ఉద్యమ జరుగుతున్న సమయంలో తుని స్టేషన్ సమీపంలో రత్నాచల్ ఎక్స్ ప్రెస్ కు కొందరు మంటలు పెట్టారు. ఈ ఘటనకు సంబంధించి కొందరిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి కోర్టులో నడుస్తున్న తుని రైలు దహనం కేసులో ఈ రోజు తుది తీర్పు వచ్చింది.
ఐదేళ్ల క్రితం తునిలో కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం పిలుపు మేరకు ఓ బహిరంగ సభలో వేలాది మంది కాపులు పాల్గొన్నారు. సభ అనంతరం ఆ ప్రాంతంలో అల్లర్లు చెలరేగి, విధ్వంస కాండ చోటుచేసుకుంది. ఈ అల్లర్లలో తుని రైల్వే స్టేషన్ లో ఉన్న రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మంటలు పెట్టారు. దీంతో రైలు పూర్తిగా దగ్ధమైంది. ఇదే ఘటనలో పలు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు దగ్ధమయ్యాయి. ఈ రైలు దహనం ఘటనలో రైల్వే పోలీసులు అప్పట్లోనే కేసు నమోదు చేశారు. కేసులో నిందితులుగా పేర్కొన్నవారందరికీ సమన్లు జారీ అయ్యాయి. వీరిలో కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పేరు కూడా ఉంది.
ఈ ఘటనపై చాలా కాలంపాటు విజయవాడ రైల్వే కోర్టులో విచారణ జరిగింది. సోమవారం ఈ కేసుపై కోర్టు తుది తీర్పు వెళ్లడించింది. తుని రైలు దగ్ధం కేసును కోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రైల్వే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించి.. దర్యాప్తు చేపట్టలేదని రైల్వే కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దగ్ధమైన రైలులో అంతమంది ప్రయాణిస్తుంటే ఒక్క సాక్షినే ప్రశ్నించడమేటి అంటూ కోర్టు సీరియస్ అయింది. అలానే బాధ్యులైన ముగ్గురి రైల్వే ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. మరి.. కోర్టు ఇచ్చిన తీర్పుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.