సృష్టికే అపురూపమైనది.. స్త్రీ జన్మ. అందులోనూ.. ఆమెకు మాతృత్వం అందించే అనుభూతి మరపురానిది. అమ్మను కాబోతున్నానని తెలిసిన ఆ క్షణం ఆమె పొందే ఆనందం మాటల్లో వర్ణించలేనిది. అందుకే.. పెళ్లైన ప్రతి మహిళ బిడ్డకి జన్మనివ్వడం కోసం ఆతృతగా ఎదురుచూస్తుంది. తన గర్భంలో మరో ప్రాణికి ఊపిరి పోయడం అంటే ఒరకంగా సృష్టించడమే. అలాంటి అపూర్వమైన మధురానుభూతిని ఆస్వాదించాలని ప్రతి మహిళ ఉవ్విళ్లూరుతుంది. కానీ మారుతున్న కాలం, అలవాట్లు, పని ఒత్తిడి వల్ల చాలా మంది మహిళలు మాతృత్వం అనే మధురనుభూతికి దూరం అవుతున్నారు. పెళ్ళై ఏళ్ళు గడుస్తున్నా పిల్లలు లేక వారిలో వారు కుమిలిపోతూ.. బాబాల చుట్టూ, ఆలయాల చుట్టూ తిరుగుతు సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. అలా పిల్లల కోసం తపించేవారి పాలిట ఆశా దీపంగా నిలుస్తోంది.. ఫర్టీ 9 ఫర్టిలిటీ సెంటర్.
నేటి బిజీ లైఫ్‌లో ‘‘సంతాన లేమి ’’ అనేది అతి పెద్ద సమస్యగా మారింది. నానాటికీ ఈ సమస్య ఎక్కువ అవుతోంది. సంతానలేమి వల్ల ఆర్థికంగా మరియు మానసికంగా దంపతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వారందరికి ఫర్టీ9 ఫర్టీలిటీ సెంటర్ ఒక ఆశాదీపం అని చెప్పొచ్చు. అధునాతన టెక్నాలజీతో సంతానలేమి సమస్యలను పోగొట్టి వారికి జీవితంపై భరోసానిస్తోంది. సంతానలేమితో బాధపడుతున్న వారి కోసం ఎన్నో పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. అందులో ప్రధానమైనది.. ఐవీఎఫ్(IVF). అసలు.. ఐవీఎఫ్ అంటే ఏమిటి? ఈ పద్దతిని వైద్యులు ఎవరకి సజెస్ట్ చేస్తారు? సక్సెస్ అవుతుందా? వంటి విషయాలపై సమగ్ర కథనం మీ కోసం..
ఎటువంటి వారికి ఐవీఎఫ్ చికిత్స అవసరం..
మాకు పిల్లలు పుట్టడం లేదు మాకు ఐవీఎఫ్ విధానం ద్వారా పిల్లల్ని కనాలని ఉంది అని మీరు అడగ్గానే.. మీకు వైద్యులు ఈ విధానాన్ని రికమెండ్ చేయరు. మీ సమస్య ఏంటి? మీకు ఎందుకు పిల్లలు పుట్టడం లేదు? అన్నది తెలుసుకుని ముందు సాధారణ పద్ధతుల్లో ప్రయత్నించిన తర్వాత మాత్రమే ఐవీఎఫ్ విధానాన్ని సూచిస్తారు. ఈ విధానానికి వయసుతో సంబంధం లేదు. కొన్నిసార్లు యుక్త వయసులో ఉన్న వారికి కూడా ఇదే విధానాన్ని రికమెండ్ చేసే పరిస్థితి రావచ్చు. అది వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది?
ఎక్కువ రోజులైనా సహజ పద్ధతిలో గర్భధారణ కానివారికి, ఫాలోపియన్ ట్యూబులు దెబ్బతిన్న వారికి, ఒవ్యులేషన్ సమస్యలు ఉన్నవారికి, ఎండో మెట్రియోసిస్ సమస్యలున్న వారికి ‘ఐవీఎఫ్’’విధానాన్ని వైద్యులు సజెస్ట్ చేస్తారు. అలాగే.. ట్యూబెక్టమీ, వాసెక్టమీ ‘రీక్యాన్సిలైజేషన్’ ఆపరేషన్ చేయించుకున్నా.. అది సక్సెస్ కాని సమయంలోనూ ఐవీఎఫ్‌ను సూచిస్తుంటారు.
ఐవీఎఫ్ చికిత్సా విధానం..
సహజంగా సంతానం కలగని సమయంలో మొదట ఇంట్రా యుటెరైన్ ఇన్‌సెమినేషన్(ఐయూఐ)విధానాన్ని వైద్యులు సజెస్ట్ చేస్తారు. అందులోనూ విఫలమైతే చిట్టచివరిగా ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తారు. ఈ ప్రక్రియ దశల వారీగా జరగుతుంది. ముందుగా మహిళ నుంచి అండాన్ని సేకరిస్తారు. అలా.. అండాలను సేకరించే ముందు, అండాశయాల నుంచి ఎక్కువ అండాలు తయారయ్యేందుకుగానూ మహళకు మొదట హర్మోన్ల ఇంజెక్షన్లు ఇస్తారు. అండాల పరిమాణం పెరిగాక యోని భాగం ద్వారా అండాశయాల నుంచి అండాలను బయటకు తీస్తారు. పురుషులు లేదా దాతల నుంచి వీర్యాన్ని సేకరిస్తారు.
ఈ రెండింటినీ ల్యాబ్‌లో కృత్రిమంగా ఫలదీకరణ చెందిస్తారు. ఆపై.. ఫలదీకరణ చెందిన పిండాలలో 2 లేదా 3 పిండాలను యోని భాగం నుంచి గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. ప్రక్రియ పూర్తయ్యక తుది ఫలితం రావడానికి దాదాపు నెల రోజులు పడుతుంది. తొలి సారి ‘ఐవీఎఫ్’ ప్రక్రియ సఫలం కాని పక్షంలో మహిళల శరీర తత్వం తదితర అంశాల ఆధారంగా మరోసారి చేస్తారు. ఆ సమయంలో భద్రపరిచిన పిండాలను ఉపయోగిస్తారు.
సక్సెస్ రేట్ ఏ వయసు వారిలో ఎక్కువ..
ఐవీఎఫ్ పద్ధతిలో సక్సెస్ రేట్ 30 నుంచి 50 శాతం వరకు ఉంటుంది. నిజానికి తక్కువ వయసున్న వారిలో ఎక్కువ సక్సెస్ అవుతూ ఉంటుందని వైద్యులు చెబుతుంటారు. అందుకు కారణం లేకపోలేదు.. వయసులో ఉన్నవారిలో వైద్యులు ఇచ్చే మందులు బాగా పనిచేస్తాయి. హార్మోనులు కూడా ఆశించిన విధంగా స్పందిస్తుంటాయి. వయసు పైబడినవారిలోనూ ఈ విధానంలో సక్సెస్ రేట్ ఎక్కువుగానే ఉంటోంది. మీరు.. ఈ విషయాల గురుంచి సంకోచించాల్సిన అవసరం లేదు. మొదట ఫర్టీ 9 సిబ్బందిని సంప్రదించండి.
ఫర్టీ 9 ఫర్టిలిటీ సెంటరే ఎందుకు?
‘ఐవీఎఫ్’ విధానం ఎంతో అడ్వాన్స్‌డ్ టెక్నాలిజీతో కూడుకున్నది. అలాంటి అధునాతన ఎక్విప్మెంట్ కైనా, నిపుణులకైనా.. ఫెర్టీ 9 ఫర్టిలిటీ సెంటర్ పెట్టింది పేరు. బెస్ట్ డిజైన్డ్ ఎయిర్ ఐవీఎఫ్ ల్యాబ్.. ఫెర్టీ 9 ఫర్టిలిటీ సెంటర్ లో అందుబాటులో ఉంది. దీని ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో మంచి క్వాలిటీతో అండాన్ని సిద్ధం చేస్తారు. ఇక్కడి వైద్యులు, దంపతులకు భరోసాను కలిగిస్తూ.. వారిలో ఆత్మ విశ్వాసాన్ని నింపుతారు.
చికిత్స మొదలు అయినప్పటి నుంచి మీకు సత్ఫలితం పొందే దాకా ఫెర్టీ 9 ఫర్టిలిటీ సెంటర్ వైద్యులు మిమ్మల్ని ఎల్లప్పుడూ గైడ్ చేస్తుంటారు. అంతేకాకుండా ఐవీఎఫ్ విధానంలో మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అత్యంత నాణ్యమైన ఎక్విప్మెంట్, మందులు, అనుభవజ్ఞులైన వైద్యులు, అత్యధిక సక్సెస్ రేట్ ఇవే మిమ్మల్ని ఫెర్టీ9 ఫర్టిలిటీ సెంటర్ ఎంచుకోండని చెప్పేందుకు కారణాలు.
కనుక, మీలో ఎవరైనా సంతానలేమితో బాధపడుతున్నా.. ఐయూఐ విధానం ద్వారా పిల్లల్ని కనాలని ఎదురుచూస్తున్నా.. ఎలాంటి భయం, బిడియం లేకుండా ఫెర్టీ9ని సందర్శించి.. మీ సంతానలేమి సమస్యకు చక్కని పరిష్కారం పొందండి. మరిన్ని వివరాల కోసం 93905 01598 ఈ నెంబర్ ను సంప్రదించండి.