అమ్మ.. ఈ పిలుపు కోసం పరితపించని స్త్రీ మూర్తి ఉండరు అనడం అతిశయోక్తి కాదు. నవమాసాలు మోసి, కని, పెంచి, గోరు ముద్దులు తినిపిస్తూ.. తన బిడ్డను అల్లారుముద్దుగా చూసుకోవాలని ఏ మహిళకు ఉండదు. మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్లు ఇలా కారణం ఏదైనా.. యువతకు కూడా సంతానం అంత తేలిగ్గా కలగడం లేదు. సంతానం కోసం పరితపించే వారి సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. ఇక్కడ సంతోషించాల్సిన విషయం ఏంటంటే.. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం పుణ్యమా అని సంతానలేమి పెద్ద సమస్య కాదనే చెప్పాలి.
సంతానలేమితో బాధపడుతున్న వారి కోసం ఎన్నో పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఫెర్టీ9 ఫర్టిలిటీ సెంటర్ లాంటి వారు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎంతో మంది దంపతుల జీవితాల్లో సంతోషం నింపారు. సంతానం కోసం ఎదురుచూసే వారికి మొదట వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. దంపతులు ఇద్దరిలో ఎవరికైనా ఏవైనా సమస్యలు ఉన్నాయేమో తెలుసుకుంటారు. ఆ తర్వాత వారికి సరైన విధానాన్ని సూచిస్తారు.
మొదట సహజంగా గర్భం దాల్చేలా ప్రయత్నాలు చేయచ్చేమో పరిశీలిస్తారు. అలా సాధ్యం కాని పక్షంలో తొలి ప్రయత్నంగా ఐయూఐ విధానాన్ని సిఫార్సు చేస్తారు. అయితే చాలా మందికి ఈ ఐయూఐ అంటే ఏంటి? అసలు ఎందుకు ఆ విధానాన్ని సిఫార్సు చేస్తారు అనేది తెలియదు. అలాంటి వారు ఈ ఆర్టికల్ లో ఐయూఐ విధానం గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
IUI విధానం అంటే ఏంటి?:
ఐయూఐ అంటే.. ఇంట్రా యుటెరిన్ ఇన్‌సెమినేషన్ అంటారు. సహజ సిద్ధంగా గర్భం దాల్చేందుకు ఇబ్బందులు ఉన్న వారిలో మొదట ఈ విధానాన్ని ప్రయత్నిస్తారు. ఇందులో జీవిత భాగస్వామి/డోనర్ వీర్య కణాలను సేకరించి వాటిని స్త్రీ యుటెరస్ లో ప్రవేశ పెడతారు. అది సక్సెస్ అయ్యేందుకు కొన్ని మందులను కూడా ఉపయోగించాల్సి ఉంటుంది. కొన్ని సమస్యల కారణంగా సహజంగా జరిగే ప్రక్రియను కృత్రిమంగా చేయడాన్నే ఐయూఐ అంటారు.
IUI ఎలా చేస్తారు?:
ఐయూఐ విధానాన్ని చేసే ముందు మహిళ రుతుక్రమాన్ని బాగా గమనిస్తారు. నెలసరి సరైన సమయంలోనే వస్తోందా లేదా అనేది తెలుసుకుంటారు. ముందు భర్త/డోనర్ నుంచి వీర్యకణాలను సేకరించి వాటిని క్లీన్ చేసి.. ఆరోగ్యవంతమైన కణాలను ఫ్రీజ్ చేసి ఉంచుతారు. లేదా అదే రోజు కూడూ కలెక్ట్ చేసి ప్రాసెస్ చేయచ్చు. నెలసరి ముగిశాక సరైన సమయంలో అప్పటికే సిద్ధం చేసిన వీర్య కణాలను మహిళ యుటెరస్ లో ప్రవేశ పెడతారు.
ఫెర్టీ9 ఫర్టిలిటీ సెంటరే ఎందుకు?:
హైదరాబాద్ మహానగరంలో ఫెర్టీ9 ఫర్టిలిటీ సెంటర్‌కు మంచి గుర్తింపు ఉంది. ఐయూఐ విధానం కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మంచి ల్యాబ్ అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఎందరో నైపుణ్యం కలగిన వైద్యులతో విశేష సేవలు అందిస్తున్నారు. ప్రతి ఒక్క జంట తమ కలలు నెరవేర్చుకోవడానికి ఫెర్టీ9 ఫర్టిలిటీ సెంటర్ నూరు శాతం సహకారం అందిస్తోంది. సంతానలేమితో బాధపడుతున్న ఎందరో దంపతుల జీవితాల్లో చిరునవ్వులు పూయించిన రికార్డు ఫెర్టీ9 ఫర్టిలిటీ సెంటర్ వారి సొంతం.
కనుక మీలో ఎవరైనా సంతానలేమితో బాధపడుతున్నా.. ఐయూఐ విధానం ద్వారా పిల్లల్ని కనాలని ఎదురుచూస్తున్నా.. ఎలాంటి భయం, బిడియం లేకుండా ఫెర్టీ9ని సందర్శించి.. మీ సంతానలేమి సమస్యకి పరిష్కారాన్ని పొందండి. చక్కని పిల్లల్ని కని.. ఆనందంగా జీవించండి. మరిన్ని వివరాల కోసం 93905 01598 ఈ నెంబర్ ను సంప్రదించండి.