నేటి కాలంలో సంతానలేమి అనేది ఒక సమస్యగా పరిణమిస్తోంది. దీని కారణంగా మాతృత్వపు మాధుర్యానికి దూరమవుతోన్న మహిళలు ఎందరో ఉన్నారు. పెళ్ళై ఏళ్ళు గడుస్తున్నా పిల్లలు లేక వారిలో వారు కుమిలిపోతున్నారు. బాబాల చుట్టూ, ఆలయాల చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. అలాంటి వారికి ఫర్టీ 9 ఫర్టిలిటీ సెంటర్ చక్కని పరిష్కారం చూపుతోంది. అధునాతన టెక్నాలజీతో సంతానలేమి సమస్యలతో భాధపడుతున్న వారికి మేమున్నామంటూ భరోసానిస్తోంది.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అనుభవం గల డాక్టర్లు ఫెర్టీ9 ఫర్టిలిటీ సెంటర్ వారి సొంతం. వీరి దగ్గర సంతానలేమి సమస్యకు పరిష్కారం తప్పక దొరుకుతుందని భరోసా ఇస్తున్నారు. ఒకటి, రెండు కాదు.. ఎన్నో విధానాలు, మరెన్నో పరిష్కారాలు వీరి దగ్గర అందుబాటులో ఉన్నాయి. కాకపోతే చాలా మంది సిగ్గు, బిడియం, సమస్య గురించి పట్టించుకోకపోవడం వల్లే అధికంగా నష్టపోతున్నారు. అలాంటి వారి కోసం అసలు ఎలాంటి విధానాలు అందుబాటులోఉన్నాయి? ఈ సమస్యను ఎలా అధిగమించవచ్చు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ఐవీఎఫ్: సంతాన సాఫల్యతను పెంపొందించే విధానాలలో ముఖ్యమైనది ఐవీఎఫ్. ఈ విధానంలో భర్త/డోనర్ నుంచి సేకరించిన వీర్యాన్ని శుభ్రం చేసి.. వీర్య కణాన్ని సేకరిస్తారు. ఈ కణాన్ని భార్య నుంచి సేకరించిన అండంతో.. శరీరం వెలుపల ల్యాబ్ లో కృత్రిమంగా ఫలదీకరణం చెందిస్తారు. ఫలితంగా ఏర్పడిన పిండాన్ని.. స్త్రీ గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. ఫలితంగా బిడ్డకు జన్మనిచ్చేలా తల్లికి చికిత్సను అందిస్తారు. ఇందులో సక్సెస్ రేటు ఎక్కువగానే ఉంటుంది.
ఐయూఐ: దీన్ని ఇంట్రా యూటెరియన్ ఇన్సెమినేషన్ విధానమంటారు. ఇది ఒక కృత్రిమమైన ఇన్సెమినేషన్ విధానం. అంటే భర్త నుంచి సేకరించిన వీర్యాన్ని కృత్రిమ విధానంలో భార్య యుటెరసన్ లో ప్రవేశ పెడతారు. సాధారణంగా జరిగే ప్రక్రియని కృత్రిమ విధానంలో చేస్తారు. దీనిలో రెండు, మూడు సైకిల్స్ వరకు ప్రయత్నిస్తారు.
ఐసీఎస్‌ఐ: పురుషుల్లో వీర్య కణాల కౌంట్ తక్కువగా, మొటిలిటీ తక్కువగా ఉన్న వారికి ఈ విధానం ద్వారా పరిష్కారాన్ని చూపిస్తారు. ఇందులో భర్త నుంచి సేకరించిన వీర్యం నుంచి బాగా ఆరోగ్యంగా ఉన్న వీర్య కణాన్ని మాత్రమే ఎంపిక చేసి అండంలో ప్రవేశ పెడతారు. ఆ తర్వాత గర్భాశయంలో ప్రవేశపెడతారు. తద్వారా గర్భం నిలబడేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఐఎంఎస్‌ఐ: ఈ విధానం అన్నింటి కంటే చాలా ఎఫెక్టివ్, సత్ఫలితాలు ఇచ్చేదిగా చెబుతారు. ఎందుకంటే ఈ విధానంలోనూ భర్త వీర్యం నుంచి మంచి వీర్య కణాన్ని ఎంపిక చేస్తారు. కానీ, చాలా శక్తివంతమైన మైక్రోస్కోప్ తో కణం ఆరోగ్యంగా ఉందా లేదా? ఎంత వేగంగా ఉంది? ఇలాంటివన్నీ తీక్షణంగా పరీక్ష చేసి ఎంపిక చేస్తారు. అందుకే దీనిలో సక్సెస్ రేటు ఎక్కువ.
చాలా మందికి ఏ ఆస్పత్రికి వెళ్లాలి? ఏ ఫర్టిలిటీ సెంటర్ అయితే బెస్ట్? అనే సందేహాలు ఉంటాయి. ఈ సందేహాలను నివృత్తి చేసేలా ఫెర్టీ9 ఫర్టిలిటీ సెంటర్ వారు బెస్ట్ అని ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నారు. సంతానలేమి సమస్యతో బాధ పడుతున్న ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపారు. కనుక మీలో ఎవరైనా ఇలాంటి సమస్యతో బాధపడుతుంటే బిడియాన్ని పక్కన పెట్టి.. ఫెర్టీ9 ఫర్టిలిటీ సెంటర్ ను సందర్శించి.. మీ సంతానలేమి సమస్యకి పరిష్కారాన్ని పొందండి. చక్కని పిల్లల్ని కని.. ఆనందంగా జీవించండి. మరిన్ని వివరాల కోసం 93905 01598 ఈ నెంబర్ ను సంప్రదించండి.