‘అమ్మ’ అనే పిలుపుతోనే స్త్రీ జీవితం పరిపూర్ణం అవుతుంది అంటారు. ఆమె.. కూతురిగా, భార్యగా, గృహిణిగా, ఉద్యోగినిగా, ఉన్నతాధికారిగా ఇలా ఒక స్త్రీ ఎన్నో పాత్రలు పోషిస్తుంది. కానీ, చివరికి ప్రతి స్త్రీ అమ్మతనంలోని అనుభూతిని పొందాలనే కోరుకుంటుంది. అందరిలాగే తన బిడ్డను నవమాసాలు మోసి, కని, పెంచి, ప్రయోజకులను చేసి తన జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలని కలలు కంటుంది. అది చాలా మంది జీవితాల్లో అంత సులువుగా సాధ్యం కాకపోవచ్చు. మారుతున్న జీవన విధానం కారణంగా ఏజ్, హెల్త్, బాడీ టైప్ ఇలాంటి వాటితో సంబంధం లేకుండా చాలా మంది దంపతులు ఈ సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా, ఎన్ని ఆస్పత్రులు తిరిగినా చాలా మందికి నిరాశే ఎదురవుతోంది. అలా పిల్లల కోసం పరితపించే వారి కలలను సాకారం చేసేందుకు ఫెర్టీ 9 ఫర్టిలిటీ సెంటర్ వారు కృషి చేస్తున్నారు.
చాలా మందికి ప్రస్తుతం ఉన్న సాంకేతికత గురించి తెలిసే ఉండచ్చు. కానీ, ఎవరిని నమ్మాలి అనే ప్రశ్న మాత్రం చాలా మంది మెదడులో మెదులుతూ ఉంటుంది. అలాంటి వారికి ఫెర్టీ 9 ఫర్టీలిటీ సెంటర్ నమ్మకాన్ని కలిగించడమే కాకుండా.. అద్భుతమైన ఫలితాలను కూడా అందిస్తోంది. అయితే అందుబాటులో ఉన్న సాంకేతికతలో ఏది మంచిది? ఏ విధానం ద్వారా మీకు మంచి ఫలితాలు వస్తాయి అనే అంశంలో కాస్త కన్ఫూజన్ ఉంటుంది. అయితే నిపుణులు ఎంతో మంది మొదట ఐవీఎఫ్ విధానాన్ని రికమెండ్ చేస్తారు. ఈ ఐవీఎఫ్ అంటే ఏంటి? దానిని ఎలా చేస్తారు? ఎవరికి ఈ విధానాన్ని రికమెండ్ చేస్తారు? ఎంత మేర ప్రయోజనం చూపిస్తుంది అనే విషయాలను తెలుసుకుందాం.
ఐవీఎఫ్ అనేది సగం కృతిమ విధానం కాగా.. సగం మాత్రం సాధారణంగానే సంతానం కలిగుతుంది. అంటే ముందు దంపతుల్లో భార్య శరీరం నుంచి ఆరోగ్యకరమైన అండాన్ని, భర్త శరీరం నుంచి అత్యంత ఆరోగ్యకరమైన, చురుకైన వీర్య కణాన్ని సేకరిస్తారు. ఆ తర్వాత వాటిని ల్యాబ్‌లో ఒక ట్యూబ్ లో ఉంచి రెండింటిని కలుపుతారు. మూడు వారాల తర్వాత కృత్రిమంగా కలిపిన ఈ అండాన్ని తిరిగి మహిళ యుటెరస్ లో ప్లేస్ చేస్తారు. చాలా మంది స్త్రీలలో ఈ విధానం ద్వారా సత్ఫలితాలు వచ్చాయి. 9 నెలల తర్వాత అందరిలాగానే ఆ మహిళకు ప్రసవం చేస్తారు. ఈ విధానం సాధారణంగా 3 వారాల్లో ముగిసే అవకాశం ఉంటుంది. కానీ, కొన్నిసార్లు మాత్రం కాస్త ఎక్కువ సమయం కూడా పట్టే అవకాశం కూడా ఉంది.
మాకు పిల్లలు కావాలి.. మాకు ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కనాలని ఉంది అంటూ మీరు అడగ్గానే డాక్టర్లు ఆ విధానాన్ని రికమెండ్ చేసేయరు. ఎందుకంటే అసలు మీకు ఎందుకు పిల్లలు పుట్టడం లేదనే విషయం తెలుసుకుంటారు. ముందు సాధారణ పద్ధతుల్లోనే కొన్ని ప్రయత్నాలు చేయాలని సూచిస్తారు. అవి సక్సెస్ కాని పక్షంలోనే మీకు ఐవీఎఫ్ విధానాన్ని సూచిస్తారు. ఈ విధానానికి వయసుతో సంబంధం లేదు. కొన్నిసార్లు యువతకు కూడా ఈ విధానాన్ని రికమెండ్ చేసే పరిస్థితి రావొచ్చు. అది వారి వారి హెల్త్ కండిషన్‌ని బట్టి ఉంటుంది. ఈ ఐవీఎఫ్ విధానం ఏజ్ తక్కువున్న వారిలో ఎక్కువగా సక్సెస్ అవుతూ ఉంటుంది. అందుకు కారణాలు లేకపోలేదు.. వయసులో ఉన్నవారికి వైద్యులు ఇచ్చే మందులు బాగా పనిచేస్తాయి. హార్మోన్లు లైతం వైద్యానికి తగినట్లుగా స్పందిస్తూ ఉంటాయి. అదే, కాస్త వయసు ఎక్కువగా ఉన్నవారిలో గమనిస్తే కొన్నిసార్లు శరీరం సహకరించకపోవచ్చు.
ఐవీఎఫ్ విధానం అనేది చాలా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో చేయాల్సిన ప్రక్రియ. హైదరాబాద్ లోనే ఫెర్టీ 9 ఫర్టిలిటీ సెంటర్ ఎంతో అడ్వాన్స్‌డ్ ఎక్విప్మెంట్ మాత్రమే కాకుండా నిపుణులను కలిగి ఉంది. బెస్ట్ డిజైన్డ్ ఎయిర్ ఐవీఎఫ్ ల్యాబ్ ఫెర్టీ 9 ఫర్టిలిటీ సెంటర్ లో అందుబాటులో ఉంది. దీంతో ఎంతో పరిశుభ్రమైన వాతావరణంలో అత్యుత్తమ క్వాలిటీతో అండాన్ని రెడీ చేస్తారు. ఇక్కడి వైద్యులు దంపతులకు ఎంతో భరోసా కలిగిస్తూ ఉంటారు. ఫెర్టీ 9 ఫర్టిలిటీ సెంటర్ వైద్యులు మిమ్మల్ని ఎల్లప్పుడూ గైడ్ చేస్తుంటారు. ఈ ఐవీఎఫ్ విధానంలో తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. కనుక మీలో ఎవరైనా సంతానలేమితో బాధపడుతున్నా.. ఐవీఎఫ్ విధానం ద్వారా పిల్లల్ని కనాలని ఎదురుచూస్తున్నా.. భయం, బిడియం లేకుండా ఫర్టీ9ని సందర్శించి మీ సమస్యకు పరిష్కారాన్ని పొందండి. మరిన్ని వివరాల కోసం 93905 01598 ఈ నెంబర్‌ని సంప్రదించండి.