సృష్టిలో అపురూపమైన స్త్రీ జన్మకు మాతృత్వం అందించే అనుభూతి మరపురానిది. అమ్మను కాబోతున్నానని తెలిసిన మరుక్షణం కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేనిది. ప్రసవ వేదనను సైతం భరిస్తూ తన ప్రతిరూపానికి జన్మనిస్తున్న సంతోషం అమ్మతనపు సౌభాగ్యానికి అద్దం పడుతుంది. జీవితంలోని మరే ఘట్టం కూడా మాతృత్వం తాలూకు మధురిమను పంచదనే సత్యం నిర్వివాదాంశం. అందుకే పెళ్లైన ప్రతి మహిళ బిడ్డకి జన్మనివ్వడం కోసం ఆతృతగా ఎదురుచూస్తుంది. అయితే.. మారుతున్న కాలం, అలవాట్లు, పని ఒత్తిడి వల్ల చాలా మంది మహిళలు మాతృత్వం అనే మధురానుభూతికి దూరమవుతున్నారు.
పెళ్ళై ఏళ్ళు గడుస్తున్నా పిల్లలు లేక వారిలో వారు కుమిలిపోతున్నారు. పిల్లల కోసం పరితపిస్తూ, బాబాల చుట్టూ, ఆలయాల చుట్టూ, ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. అలా పిల్లల కోసం తపించేవారికి ఆశా దీపంగా నిలుస్తుంది ఫర్టీ 9 ఫర్టిలిటీ సెంటర్. అధునాతన టెక్నాలజీతో సంతానలేమి సమస్యలతో భాధపడ్తున్న వారికి మేమున్నామంటూ భరోసానిస్తోంది. సంతాన లేమి సమస్యతో బాధపడుతున్న జంటలలో.. పురుషులలో, స్త్రీలలో ఉన్న సమస్యల ఏంటో పరీక్షల ద్వారా తెలుసుకొని వారికి తగు చికిత్సను అందింస్తూ వారికి ఆ మాతృత్వ అనుభూతిని కలిగిస్తున్నారు.
పురుషులలో సెక్స్ కోరికలు కలగడానికి ప్రధానంగా ‘టెస్టోస్టీరాన్’ హార్మోన్ అవసరం. దీంతోపాటు సంతానోత్పత్తికి ఫాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యుటినైజింగ్ హార్మోన్ లు కూడా అవసరం. పురుషులలో ఈ హార్మోన్ల పరిమాణం తగినంతగా లేకపోతే.. అది సంతానలేమి సమస్యకి దారితీస్తుంది. మొదట హార్మోన్ల పరిమాణం ఎంత ఉందో తెలుసుకునేందుకు కొన్ని టెస్టులు నిర్వహిస్తారు. ఆ ఫలితాలను బట్టి సమస్య తెలుసుకుని, తగు చికిత్స అందిస్తే పురుషులలో సంతానలేమి సమస్య పరిష్కార మవుతుంది.
స్త్రీలలో సంతాన సాఫల్యత వృద్ధికి ‘ఈస్ట్రోజెన్’ హార్మోన్ అవసరం. దీనితోపాటు సంతానోత్పత్తికి ప్రొజెస్టిరోన్ హార్మోన్ అవసరం. స్త్రీలలో ఈ హార్మోన్ లోపం.. ప్రధానంగా సంతానలేమికి కారణం. మొదట ఈ హార్మోన్ల పరిమాణం తెలుసుకునేందుకు టెస్టులు నిర్వహించి.. ఫలితాలను బట్టి సమస్య తెలుసుకుని, తగు చికిత్స అందిస్తే స్త్రీలలో సంతానలేమి సమస్య పరిష్కార మవుతుంది.
ఐవీఎఫ్: సంతాన సాఫల్యతను పెంపొందించే విధానాలలో ముఖ్యమైనది ఐవీఎఫ్. ఈ విధానంలో స్త్రీ అండాశయం నుంచి సర్జికల్ పద్ధతిలో అండాలను సేకరించి, ల్యాబొరేటరీలో పురుషుని స్పెర్మ్ సెల్స్‌తో ఫలదీకరించి.. పిండాన్ని ఉత్పత్తి చేస్తారు. ఫలితంగా ఏర్పడిన పిండాన్ని.. స్త్రీ గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. తద్వారా బిడ్డకు జన్మనిచ్చేలా తల్లికి చికిత్సను అందిస్తారు. ఈ చికిత్సా విధానం.. సంతానలేమికి అత్యుత్తమ పరిష్కారంగా పేరొందింది.
ఐయూఐ: ఇంట్రా యూటెరిన్ ఇన్సెమినేషన్…ఇది ఒక కృత్రిమమైన ఇన్సెమినేషన్ విధానం. ఈ పద్ధతిలో పురుషుని నుంచి ఆరోగ్యకరమైన స్పెర్మ్ సెల్స్‌ను సేకరించి, వాటిని అండోత్పత్తి జరిగే సమయంలో స్త్రీ గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. ఈ విధంగా ప్రవేశపెట్టిన స్పెర్మ్ సెల్స్ ఫాలోపియన్ ట్యూబ్‌లోకి చేరతాయి. అక్కడ అండంతో కలిసి ఫలదీకరణ చెందుతాయి. ఫలితంగా సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఇది పిండంగా అభివృద్ధి చెందుతుంది
ఐసిఎస్‌ఐ: పురుషుల్లో వీర్య కణాల సంఖ్య, వేగం తక్కువగా ఉన్న కారణంగా సంతానలేమితో బాధపడుతున్న వారికి ఇది ఉత్తమమైన చికిత్స.
ఐఎంఎస్‌ఐ: ఈ విధానంలో హై పవర్ మైక్రోస్కోపుని ఉపయోగించి.. నాణ్యమైన వీర్యకణాలు ఎంపిక చేసి.. అండంతో ఫలదీకరణం చెందిస్తారు. ఫలితంగా ఏర్పడిన పిండాన్ని.. స్త్రీ గర్భాశయంలోకి ప్రవేశపెడతారు.
పైన చెప్పబడిన అన్ని చికిత్సా విధానాలలో ఫర్టీ 9 ఫర్టిలిటీ సెంటర్ వారు అధునాతన టెక్నాలజీని వాడుతూ మంచి సక్సెస్ రేట్ సాధిస్తున్నారు. కనుక మీలో ఎవరైనా ఇలాంటి సమస్యతో బాధపడుతుంటే బిడియాన్ని పక్కన పెట్టి.. ఫర్టీ9ని సందర్శించి.. మీ సంతానలేమి సమస్యకి పరిష్కారాన్ని పొందండి. చక్కని పిల్లల్ని కని.. ఆనందంగా జీవించండి. మరిన్ని వివరాల కోసం 9390501598 ఈ నెంబర్ ను సంప్రదించండి.