అమ్మానాన్న అనే పిలుపులో ఉండే మాధుర్యాన్ని.. ఎన్ని కోట్లు పెట్టినా కొనలేం అంటారు. ప్రస్తుతం ఎంతో మంది దంపతులు కొన్ని కోట్లు ఖర్చుపెట్టినా ఆ అదృష్టాన్ని పొందలేకపోతున్నాం అంటూ బాధపడుతున్నారు. మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేయకపోవడం ఇలా ఎన్నో కారణాల వల్ల సంతానలేమితో సతమతమవుతున్నారు. ఎక్కడికి వెళ్లాలి? ఎవరిని కలవాలి? అనే సందాహేలతో అలాగే ఉండిపోతున్నారు.
అయితే అభివృద్ధి చెందిన సాంకేతక పరిజ్ఞానం, ఫెర్టీ9 ఫర్టిలిటీ సెంటర్ వంటి ఆస్పత్రుల కృషితో సంతానలేమి అనేది ఇప్పుడు పెద్ద సమస్య కాదనే చెప్పాలి. అయితే ఎలాంటి పద్ధతిని ఎంచుకోవాలి. అది మనకు సరైందా కాదా? అనే అనుమానాలు ఉంటాయి. కొందరు గతంలో కొన్ని ప్రయత్నించి విఫలమై ఉంటారు. అలాంటి వారు సత్ఫలితాలు అందిస్తున్న IMSI పద్ధతి గురించి ఈ ఆర్టికల్ తెలుసుకోండి.
గర్భం దాల్చేందుకు చాలా పద్ధతులు ఉంటాయి. వాటిలో ఐఎంఎస్‌ఐ కూడా ఒకటి. అయితే మీరు వైద్యులను సంప్రదించిన వెంటనే ఈ పద్ధతిని రిఫర్ చేయరు. ఎందుకంటే మొదట ఐవీఎఫ్, ఐయూఐ వంటి పద్ధతులను సూచిస్తారు. వాటిలో గనుక విఫలమైతే ఆ తర్వాత ఐఎంఎస్‌ఐ పద్ధతికి వెళ్తారు. ఈ విధానంలో ఎంతో మంది దంపతులు సక్సెస్ అయ్యారు. అందుకే దీనిని అత్యంత సక్సెస్ రేట్ ఉండే పద్ధతి అంటారు.
ఐవీఎఫ్ తరహాలోనే ఐఎంఎస్‌ఐ పద్ధతిలోనూ భర్త నుంచి వీర్యం సేకరించి ఆరోగ్యకరమైన, వేగంగా ఉండే వీర్య కణాన్ని ఎంపిక చేసి కృత్రిమంగా అండంలో ప్రేవేశపెడతారు. కాకపోతే ఈ విధానంలో ఎంతో పవర్‌ఫుల్ మైక్రోస్కోప్ ని వినియోగిస్తారు. దీని ద్వారా బెస్ట్ వీర్య కణాన్ని గుర్తించే అవకాశం ఉంటుంది. అందుకే ఈ విధానంలో సక్సెస్ రేట్ ఎక్కువని చెబుతుంటారు.
ఐయూఐ, ఐవీఎఫ్ విధానాల్లో విఫలమైన వారికి ఈ విధానాన్ని రిఫర్ చేస్తారు. ఈ విధానంలో భార్య నుంచి అండాన్ని సేకరిస్తారు. భర్త నుంచి సేకరించిన వీర్యాన్ని ల్యాబ్ లో శుభ్ర పరిచి.. అతిపెద్ద మైక్రోస్కోప్ ద్వారా ఒక ఆరోగ్యకరమైన, వేగవంతమైన, ఉత్తమ వీర్య కణాన్ని సేకరిస్తారు. దానిని కృత్రిమంగా అండంలో ప్రవేశపెట్టి ల్యాబ్‌లోనే వారంపాటు ఉంచుతారు. ఆ తర్వాత దానిని భార్య గర్భాశయంలో ప్రవేశపెడతారు. ఆ తర్వాత సాధారణంగానే గర్భం దాల్చడం, డెలివరీ జరుగుతాయి.
ఫెర్టీ9 ఫర్టిలిటీ సెంటర్ లో అత్యాధునిక ల్యాబ్, నిపుణులైన డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. ఒక్క హైదరాబాద్ లోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది దంపతుల జీవితాల్లో వెలుగులు నింపింది ఫెర్టీ9 ఫర్టిలిటీ సెంటర్. ఐఎంఎస్‌ఐ విధానంలో హైదరాబాద్ లోనే అత్యధిక సక్సెస్ రేట్ సాధించారు.
కనుక మీలో ఎవరైనా సంతానలేమితో బాధపడుతున్నా.. ఐఎంఎస్‌ఐ విధానం ద్వారా పిల్లల్ని కనాలని ఎదురుచూస్తున్నా.. ఎలాంటి భయం, బిడియం లేకుండా ఫెర్టీ9ని సందర్శించి.. మీ సంతానలేమి సమస్యకి పరిష్కారాన్ని పొందండి. చక్కని పిల్లల్ని కని.. ఆనందంగా జీవించండి. మరిన్ని వివరాల కోసం 93905 01598 ఈ నెంబర్ ను సంప్రదించండి.