జియో నెక్స్ట్‌ కు పోటీగా వచ్చేస్తోన్న నోకియా.. ధర, ఫీచర్లు ఇవే

nokia

మధ్యతరగతి వారికి స్మార్ట్‌ ఫోన్‌ను చేరువ చేసేందుకు ‘జియో నెక్స్ట్‌’ను తీసుకొస్తున్నట్లు రిలయన్స్‌ సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. వినాయక చవితికే మార్కెట్‌లోకి విడుదల చేయాలనుకున్నా.. ఫోన్‌ పార్ట్స్‌ లభ్యంలో జాప్యం కారణంగా జియో నెక్స్ట్‌ విడుదలను దీపావళికి వాయిదా వేశారు. ఇప్పుడు జియోకి పోటీగా నోకియో వచ్చేస్తోంది. ఒకప్పుడు వెలుగు వెలిగిన నోకియా మళ్లీ ఆండ్రాయిడ్‌లో చౌకైన ఫోన్‌ను అందించి సాధారణ వినియోగదారుడికి చేరువ కావాలని భావిస్తోంది. అందుకు కొత్తగా 4జీ లెవల్‌లో ‘నోకియా సీ01’ ఫోన్‌ను లాంఛ్‌ చేయబోతున్నట్లు ప్రకటించింది. నోకియా కూడా దీపావళికే మార్కెట్‌లోకి వస్తున్నట్లు ప్రకటించింది. ఇది కచ్చితంగా జియోకి పోటీ అవుతుందనే భావిస్తున్నారు.

nokiaనోకియా సీ01 ఆండ్రాయిడ్‌11తో అందుబాటులోకి రానుంది. 2 జీబీ ర్యామ్‌, 16 ఇంటర్నల్‌ మెమొరీతో అందిస్తున్నారు. ఎస్‌డీ కార్డుతో మెమొరీని పెంచుకునే సౌలభ్యం ఉంది. 5 ఎంపీ రేర్‌ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా ఇందులో ఉంటుంది. ఆక్టాకోర్‌ 1.6 జీహెచ్‌జడ్‌ యునిసోక్‌ ప్రాసెసర్‌ ఉంటుంది. 5.45 అంగుళాలల హెచ్‌డీ తెర ఉంటుందని తెలిపారు. ఈ ఫోన్‌కు 3000 ఎంఏహెచ్ సామర్థ్యం ఉన్న బ్యాటరీని అమర్చారు. ఈ ఫోన్‌ అన్ని ప్రముఖ ఆప్‌లైన్‌ స్టోర్లు, ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లు, నోకియా.కామ్‌లో అందుబాటులో ఉంది. నోకియా సీ01 ప్లస్‌(2జీబీ+16జీబీ)ధరను రూ.5,999గా నిర్ణయించారు. జియో ఎక్స్‌క్లూజివ్‌ ఆఫర్‌ అవైల్‌ చేసుకున్నవారికి అదనంగా 10 శాతం తగ్గింపుతో 5,399కే లభిస్తుందని తెలిపారు.