రూ.799కే అదిరిపోయే బ్లూటూత్ స్పీకర్!

ఇప్పుడున్న రోజుల్లో ప్రతి ఒక్కరికీ గాడ్జెట్స్ అనేవి ప్రిస్టేజ్ ఇష్యూ అయిపోయాయి. పైగా.. గాడ్జెట్ ఏదైనా బ్రాండెడ్ వాటికే ప్రజలు ఆకర్షితులు అవుతున్నారు. ఇక బ్లూటూత్ స్పీకర్స్ ఇందుకు మినహాయింపు కాదు. అయితే.., బ్లూటూత్ స్పీకర్ కేవలం పర్టికులర్ ప్లేసెస్ లో కాస్త పెద్ద సౌండ్ తో పాటలు వినడానికి సరిపోతాయి. వీటి కోసం వేలకి వేలు కుమ్మరించలేరు. అలా అని క్వాలిటీ లేని స్పీకర్స్ తో బెస్ట్ ఎక్సపీరియన్స్ పొందలేరు. ఈ సమస్యని సాల్వ్ చేయడానికే భారతీయ బ్రాండ్ మివీ తన కొత్త బ్లూటూత్ స్పీకర్ మివీ ప్లేని లాంచ్ చేసింది. దీని ధర రూ.799గా నిర్ణయించడం విశేషం. ఇతర కంపెనీల బ్లూటూత్ స్పీకర్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ రేటు. ఇలానే ఫీచర్స్ ప్రకారం చూసుకున్నా ఇది బెస్ట్ ఎక్సపీరియన్స్ ఇచ్చే గాడ్జెట్ గా నిలుస్తోంది. ఈ స్పీకర్ లో 52ఎంఎం డైనమిక్ డ్రైవర్ను కంపెనీ అందించింది. ఇది డీప్ బేస్ను అందించనుంది. ఇక ఐపీఎక్స్4 స్ప్లాష్ రెసిస్టెన్స్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్స్ అదనం.

spe 2ఇక అవుట్ లుక్ పరంగా స్టైలిష్ బాడీ, స్ప్లాష్ ప్రూఫ్ రేటింగ్ ఈ స్పీకర్స్ సొంతం. ఇక రెండున్నర గంట సేపు ఛార్జింగ్ పెడితే ఈ బ్లూటూత్ స్పీకర్ ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ అయితే.., 12 గంటల ప్లేబ్యాక్టైం అందించగల కెపాసిటీ ఈ బ్లూటూత్ స్పీకర్ కి ఉంది. వైట్, ఆరెంజ్, బ్లూ, బ్లాక్, గ్రీన్, స్కై బ్లూ రంగుల్లో ఈ స్పీకర్ అందుబాటులో ఉంది. మిగాతా గాడ్జెట్స్ ని ఎలా కొనుగోలు చేస్తామో అలా అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ కామర్స్ సైట్స్ లో ఈ బ్లూటూత్ స్పీకర్స్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. లేదా డైరెక్ట్ గా మివీ.ఇన్ వెబ్ సైట్ నుండి కూడా మివీ ప్లేని ఆర్డర్ చేసుకోవచ్చు. సినిమాలు చూసేటప్పుడు, పాటలు వినేటప్పుడు మంచి సౌండ్ క్వాలిటీని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే వెంటనే ఈ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అయితే.., మివీ ప్లే రూ.799కే అన్నది ప్రత్యేకమైన లాంచ్ ధర. దీని అసలు ధర రూ.899గా ఉంది. కాబట్టి త్వరగా కొనుగోలు చేస్తే రూ.1000 వరకు సేవ్ చేసుకోవచ్చు. మరి.. మివీ ప్లే ఫీచర్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.