చాలా మందికి ఫుల్ సౌండ్ లో సాంగ్స్ వినాలని, గేమ్స్ ఆడాలని ఉంటుంది. కానీ, వారి టీవీ, పీసీలు అంత సౌండ్ కి సపోర్ట్ చేయవు. అలాంటప్పుడు తప్పకుండా సౌండ్ బార్, స్పీకర్స్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కానీ, అది కాస్త ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే అవుతుంది. అలాంటి వారి కోసం ఇప్పుడు బ్లౌపంక్ట్ కంపెనీ బడ్జెట్ ధరలో ఒక సౌండ్ బార్ ని విడుదల చేసింది.
ప్రస్తుతం అందరూ స్మార్ట్ టీవీలనే కొనుగోలు చేస్తున్నారు. అందులోనూ 32 ఇంచెస్, 43 ఇంచెస్, 50 ఇంచెస్ అంటూ పెద్ద పెద్ద టీవీలను తీసుకుంటున్నారు. ఆ టీవీలకు కచ్చితంగా సౌండ్ బార్ ఉంటేనే మీకు మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ వస్తుంది. ఇంకొందరు గేమింగ్ ప్రియులు ఉంటారు. వారు ఎప్పుడూ పీసీలో గేమ్స్ ఆడుతూ ఉంటారు. వీళ్లకి మంచి సౌండింగ్ ఎక్స్ పీరియన్స్ కూడా ఉండాలి. గేమ్స్ కి సౌండ్ ఎంతో ముఖ్యం. అందుకోసం పెద్ద పెద్ద స్పీకర్స్ కొనుక్కుంటూ ఉంటారు. కానీ, ఇప్పుడు అలాంటి వారి కోసం ఒక బెస్ట్ బడ్జెట్ బ్లూటూత్ స్పీకర్ విడుదలైంది.
బ్లౌపుంక్ట్ కంపెనీకి మార్కెట్ లో మంచి ఆదరణ ఉంది. ఇప్పుడు ఈ కంపెనీ నుంచి ఒక మంచి గేమింగ్ బ్లూటూత్ సౌండ్ బార్ ఒకటి బడ్జెట్ ధరలో విడుదలైంది. ఈ 25 వాట్స్ సౌండ్ బార్ ప్రత్యేకతల విషయానికి వస్తే.. ఇందులో 2000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ స్పీకర్ లో 6 గంటల ప్లేటైమ్ లభిస్తుంది. RGB లైట్స్, టర్బో వోల్ట్ ఛార్జింగ్, ఆక్సా కేబుల్, బ్లూటూత్, యూఎస్ బీ- టీడబ్ల్యూఎస్ కనెక్టివిటీ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఈ స్పీకర్ ని పీసీ, ల్యాప్ టాప్, టీవీలకు కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంక దీని ఎమ్మార్పీ విషయానికి వస్తే.. రూ.3,999 కాగా లాంఛింగ్ ఆఫర్ కింద 53 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.1,899కే అందిస్తున్నారు. ఈ బ్లౌపంక్ట్ బ్లూటూత్ సౌండ్ బార్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.