బీసీసీఐ బాస్ గా ‘రోజర్ బిన్నీ‘ భాద్యతలు చేపట్టాక.. బోర్డులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పురుషులతో పాటు మహిళా క్రికెటర్లకు సమాన వేతనం కల్పించడం, చేతన్ శర్మ సారథ్యంలోని జాతీయ సెలక్షన్ కమిటీపై వేటు, క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) ఏర్పాటు.. ఇలా పలు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజగా, భారత మాజీ క్రికెటర్, సీనియర్ ఉమెన్స్ క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్న రమేశ్ పవార్ ని ఆ బాధ్యతల నుంచి తప్పించారు. బీసీసీఐ, […]
భారత క్రికెట్ బోర్డు గత కొంత కాలంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ లో వైఫల్యాల తర్వాత బీసీసీఐపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సరైన ఆటగాళ్లను ఎంపిక చేయలేదని, నైపుణ్యం కలిగిన ప్లేయర్స్ ను జట్టులోకి తీసుకోకుండా విఫలం అవుతున్న ఆటగాళ్లను ఎందుకు తీసుకుంటున్నారంటూ మాజీలతో పాటుగా సగటు క్రికెట్ అభిమానులు మండిపడ్డారు. దాంతో బీసీసీఐ కొత్త సెలక్షన్ కమిటీని నియమించడానికి సిద్దమైంది. ఇప్పటికే పాత సెలెక్షన్ కమిటీని రద్దు చేసింది. […]
ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా ప్రదర్శనపై బీసీసీఐ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. వరల్డ్ కప్ వైఫల్యాలపై పోస్టుమార్టంకు బీసీసీఐ కొత్త అధ్యక్షుడు రోజర్ బిన్నీ సిద్ధమైనట్లు సమాచారం. అందులో భాగంగా చేతన్ శర్మ నేతృత్యంలోని నేషనల్ సెలక్షన్ కమిటీ మొత్తాన్ని ఇంటికి పంపేశారు. కొత్త కమిటీ కోసం దరఖాస్తులు కూడా ఆహ్వానించారు. మరికొన్ని రోజుల్లోనే ఐదుగురు సభ్యులతో కూడిన కొత్త సెలెక్షన్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. అయితే.. వరల్డ్ కప్ ఫెల్యూర్‌పై […]
ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా వైఫల్యంపై బీసీసీఐ దిద్దుబాటు చర్చలు దిగింది. చేతన్ శర్మ చీఫ్‌గా ఉన్న సెలెక‌్షన్ కమిటీ మొత్తాన్ని తొలగించి వారిపై వేటు వేసింది. వరల్డ్ కప్‌లో సెమీస్ వరకు చేరిన టీమిండియా.. సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో దారుణంగా ఓడిన విషయం తెలిసిందే. అయితే.. వరల్డ్ కప్‌కు ముందు అదే పనిగా కెప్టెన్లను మార్చడం.. ఏ మాత్రం ప్రణాళిక లేకుండా జట్టును ఎంపిక చేయడంపై కొత్తగా ఎన్నికైన బీసీసీఐ […]
2022 మినీ వరల్డ్ కప్.. ఓ మహా సంగ్రామాన్నే తలపిస్తోంది. అటు మ్యాచ్ లతో రోజురోజుకు ఉత్కంఠగా సాగుతోంది టోర్నీ. ఇటు వివాదాలతో కూడా టోర్నీ యుద్దాన్ని తలపిస్తోంది. తాజాగా పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ టీమిండియాతో పాటు ICC పై కూడా విమర్శలు చేశాడు. ఐసీసీ భారత్ కు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాను ఎలాగైన సెమీస్ కు చేర్చాలని ఐసీసీ భావిస్తోందని ఆరోపణలు చేశాడు. తాజాగా జరుగుతున్న వరల్డ్ కప్ […]
ఇండియన్ క్రికెట్ లో నార్త్ పెత్తనం తగ్గిందా? సౌథర్న్ రాష్ట్రాల చేతుల్లోకి వచ్చినట్టేనా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. బీసీసీఐ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ ఎన్నికైన నాటి నుంచి సమీకరణాలు మారినట్లుగా వార్తలొస్తున్నాయి. మొన్నటివరకు దక్షిణాది క్రికేటర్లు అంటే చిన్నచూపు చూసిన బీసీసీఐ, నేడు వారికే పట్టం కట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటూ జాతీయ మీడియా కథనాలు ప్రసారం వచ్చింది. తాజాగా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ పర్యటనకు బీసీసీఐ ప్రకటించిన భారత జట్లే అందుకు సాక్ష్యం. ఇండియన్ క్రికెట్ లో […]
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై బీసీసీఐ నూతన అధ్యక్షుడు రోజర్ బిన్నీ ప్రశంసల వర్షం కురిపించాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలి సారి మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి మాట్లాడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్‌లో మాట్లాడిన రోజర్ బిన్నీ. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా.. పాకిస్థాన్‌పై విజయం సాధించడంపై సంతోషంగా ఉందన్నారు. అలాగే హరీస్ రౌఫ్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ కొట్టిన స్ట్రేట్ సిక్స్ […]
బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ శకం ముగిసిన సంగతి తెలిసిందే. అతని స్థానంలో 1983 వరల్డ్ కప్ టీంలోని సభ్యుడు రోజర్ బిన్నీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. గంగూలీ మరోసారి ఆ పీఠాన్ని అధిరోహించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ.. ‘దాదా’ గిరి ఎక్కువవుతోందంటూ బీసీసీఐ పెద్దలు బయటకు పంపించారు. దీని వెనుక చెన్నై సూపర్ కింగ్స్ యజమాని శ్రీనివాసన్ హస్తం ఉన్నట్లుగా వార్తలోస్తున్నాయి. వీరు ఇంతటితో ఊరుకునేలా లేరు. బీసీసీఐ నుంచి దాదా వర్గానికి చెందిన అందరిని బయటకు పంపే […]
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(బీసీసీఐ) 36వ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీమిండియా మాజీ క్రికెటరైన బిన్నీ.. 1983లో కపిల్‌దేవ్ సారథ్యంలో భారత్ సాధించిన తొలి వన్డే వరల్డ్ కప్ టీమ్ సభ్యుడు. బీసీసీఐ అధ్యక్షపదవి కోసం జరిగిన ఎన్నికల్లో రోజర్ తప్ప మరెవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో.. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్థానంలో బోర్డు నూతన అధ్యక్షుడిగా బీసీసీఐ సభ్యులు ప్రకటించారు. బుధవారం ముంబైలోని తాజ్ హోటల్‌లో […]
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(బీసీసీఐ)కి నూతన అధ్యక్షుడి నియామకం జరిగింది. టీమిండియా మాజీ క్రికెటర్, 1983 వన్డే వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ సభ్యుడు రోజర్ బిన్నీని నూతన అధ్యక్షుడిగా బీసీసీఐ ప్రకటించింది. దీంతో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఇకపై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అయిపోయాడు. ఈ నెల 11, 12 తేదీల్లో బీసీసీఐ అధ్యక్ష, ఇతర పదవుల కోసం జరిగిన నామినేషన్ ప్రక్రియలో అధ్యక్ష పదవికి.. కర్ణాటక క్రికెట్ […]