బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ శకం ముగిసిన సంగతి తెలిసిందే. అతని స్థానంలో 1983 వరల్డ్ కప్ టీంలోని సభ్యుడు రోజర్ బిన్నీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. గంగూలీ మరోసారి ఆ పీఠాన్ని అధిరోహించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ.. ‘దాదా’ గిరి ఎక్కువవుతోందంటూ బీసీసీఐ పెద్దలు బయటకు పంపించారు. దీని వెనుక చెన్నై సూపర్ కింగ్స్ యజమాని శ్రీనివాసన్ హస్తం ఉన్నట్లుగా వార్తలోస్తున్నాయి. వీరు ఇంతటితో ఊరుకునేలా లేరు. బీసీసీఐ నుంచి దాదా వర్గానికి చెందిన అందరిని బయటకు పంపే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ దిశగా ప్రయత్నాలు కూడా మొదలుపెట్టినట్లు సమాచారం. వారు కనుక ఈ ప్రయత్నంలో సఫలీకృతమైతే.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ ఔటైనట్లే.
గంగూలీని రెండోసారి అధ్యక్ష పీఠం ఎక్కకుండా అడ్డుకున్న బీసీసీఐ పెద్దలు ఇప్పుడు వారి తర్వాత టార్గెట్ ను కూడా నిర్దేశించుకున్నట్లుగా సమాచారం. వారి కన్ను నేషనల్ సెలక్షన్ కమిటీ చైర్మెన్ చేతన్ శర్మ మీద పడినట్లు వార్తలొస్తున్నాయి. గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడయ్యాక.. సెలక్షన్ కమిటీకి చైర్మెన్ గా చేతన్ శర్మ నియామకం జరిగింది. క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఇచ్చిన సిఫార్సుల మేరకు 2020 డిసెంబర్ లో సెలక్షన్ కమిటీ సభ్యులను నియమించారు. ఈ కమిటీకి చేతన్ శర్మ నేతృత్వం వహిస్తుండగా.. సునీల్ జోషి, హర్విందర్ సింగ్, దేబాసిష్ మెహంతీలు సభ్యులుగా ఉన్నారు. అయితే.. బీసీసీఐ నుంచి దాదాను పంపించిన తర్వాత ఇప్పుడు చేతన్ శర్మ వర్గాన్ని కూడా సాగనంపేందుకు సన్నాహకాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అయితే.. అది భారత జట్టు టీ20 ప్రపంచకప్ లో రాణించడంపైనే ఆధారపడి ఉన్నట్లు తెలుస్తోంది.
The new office bearers of BCCI ✅
Representatives in the IPL Governing Council ✅
Representative of the General Body elected in the Apex Council of the BCCI ✅ pic.twitter.com/BTvaGT2Otc
— BCCI (@BCCI) October 18, 2022
ఒకవేళ టీమిండియా ఈ టోర్నీలో విఫలమైతే వీరిని పంపించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ‘చేతన్ శర్మ పనితీరుపై కొత్త పాలకవర్గంలో అందరూ సంతృప్తిగానే ఉన్నారు. కానీ వాళ్లు కొత్త సెలక్షన్ కమిటీని నియమించాలని కోరుకుంటున్నారు. వారు అనుకున్నది జరగాలన్నా, కొత్త క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ)ని నియమించేవరకూ చేతన్ శర్మ ఆ పదవిలోనే కొనసాగుతాడు..’ అని తెలిపాడు. వీరి స్థానంలో ఒడిశాకు చెందిన మాజీ క్రికెటర్ శివ సుందర్ దాస్, బెంగాల్ మాజీ క్రికెటర్ దీప్ దాస్ గుప్తా, నేషనల్ జూనియర్ సెలక్టర్ రణదేవ్ బోస్ చోటు దక్కించుకునే అవకాశాలున్నట్టు వార్తలోస్తున్నాయి. వీరితో పాటు బెంగాల్ కు చెందిన మాజీ క్రికెటర్ లక్ష్మీ రతన్ శుక్లా/ ఒడిశాకు చెందిన సంజయ్ రౌల్/టీమిండియా స్పీడ్ స్టర్ ఉమేష్ యాదవ్ కోచ్.. సుబ్రాతో బెనర్జీ కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.
Chetan Sharma’s fate hangs in balance as BCCI likely to rejig selection panel after T20 World Cup https://t.co/oaWnbdInt8
— Republic (@republic) October 19, 2022