‘విరాట్ కోహ్లీ..’ ఈ పేరుకున్న పాపులారిటీ అందరకి సుపరిచితమే. ఒకరకంగా చెప్పాలంటే..’ ఇట్స్ నాట్ ఆ నేమ్.. ఇట్ ఈజ్ ఏ బ్రాండ్’ అని చెప్పొచ్చు. అలాంటి గొప్ప ఆటగాడిని ఐసీసీ విస్మరించింది. టీ20 ప్రపంచ కప్ సూపర్-12 పోరు ముంగిట భారత ఆటగాళ్లతో కలిసి ప్రమోషన్ వీడియో షూట్ చేసిన ఐసీసీ.. అందులో కోహ్లీని చూపించలేదు. టీమిండియా సారధి రోహిత్ శర్మ సహా మరో ముగ్గురు ఆటగాళ్లను మాత్రమే చూపించింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన క్రికెట్ అభిమానులు ఐసీసీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘కోహ్లీ లేని భారత్ అసంపూర్ణం..’ అంటూ ఐసీసీని ఏకిపారేస్తున్నారు.
విరాట్ కోహ్లి.. ఈ పేరు వింటే చాలు.. క్రికెట్ ప్రపంచంలో అతడు సాధించిన విజయాలు, లిఖించిన రికార్డులే గుర్తుకువస్తాయి. అలాంటి కోహ్లీకి తన మనసులో ఏమనిపించిందో ఏమో.. టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ ఆరంభానికి ముందే టీ20 ఫార్మాట్‌లో కెప్టెన్‌గా వైదొలుగుతున్నట్టు సంచలన ప్రకటన చేశాడు. అప్పటినుంచి జట్టులో ఒక సాధారణ ఆటగాడిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. కాగా, ఇటీవల ముగిసిన ఆసియా కప్ 2022 వరకు ఫామ్ లేక నానా తంటాలు పడ్డ కోహ్లీ, ఈ టోర్నీలో తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. ఇప్పడు తన దృష్టంతా దేశానికి ప్రపంచ కప్ సాధించి పెట్టడమే.ఈ నేపథ్యంలో ఐసీసీ కొందరు భారత ఆటగాళ్లతో కూడిన ఓ వీడియోను విడుదల చేసింది. అందులో ఈ రికార్డుల రారాజును విస్మరించింది.
King 🥶. @imVkohli | #ViratKohli𓃵 | #T20WorldCup pic.twitter.com/27EtEdb1tQ
— Suprvirat (@ishantraj51) October 19, 2022
ఐసీసీ ఇన్స్టాలో పోస్ట్ చేసిన వీడియోలో కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, మిస్టర్ ఇండియా 360 సూర్యకుమార్ యాదవ్, మిస్టరీ స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ కనిపించారు. ఈ నాలుగు ఛాతీపై చేయి వేసుకుని.. “మీరు సిద్ధంగా ఉన్నారా?” అన్నట్లుగా వీడియో ఉంది. అక్టోబర్ 23న జరగనున్న భారత్, పాకిస్తాన్ పోరు కోసం ఐసీసీ ఈ జిమ్మిక్కులు చేసినట్లు తెలుస్తోంది. ఐసీసీ ఆలోచనే బాగానే ఉన్నా.. ఈ వీడియోలో విరాట్ కనిపించకపోవడం చర్చనీయాంశం అవుతోంది. దీనిపై కోహ్లీ అభిమానులు సహా భారత క్రికెట్ అభిమానులు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘కింగ్ కోహ్లి ఎక్కడ..?’, ‘విరాట్ ను చూపించలేదు.. మాజీ సారధిని విస్మరించారా?’, ‘కోహ్లీ లేని టీమిండియా అసంపూర్ణం’ అంటూ కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. కాగా, ఆస్ట్రేలియాతో జరిగిన వామప్ మ్యాచ్ లో కోహ్లి అద్భుత ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. కళ్లు చెదిరే రనౌట్ తో పాటు, బౌండరీ లైన్ వద్ద ఒంటి చేత్తో క్యాచ్ పట్టి ఔరా అనిపించాడు.