బీసీసీఐ బాస్ గా ‘రోజర్ బిన్నీ‘ భాద్యతలు చేపట్టాక.. బోర్డులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పురుషులతో పాటు మహిళా క్రికెటర్లకు సమాన వేతనం కల్పించడం, చేతన్ శర్మ సారథ్యంలోని జాతీయ సెలక్షన్ కమిటీపై వేటు, క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) ఏర్పాటు.. ఇలా పలు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజగా, భారత మాజీ క్రికెటర్, సీనియర్ ఉమెన్స్ క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్న రమేశ్ పవార్ ని ఆ బాధ్యతల నుంచి తప్పించారు.
బీసీసీఐ, సీఏసీని ఏర్పాటు చేసిందో.. లేదో.. తక్షణమే తన పనిని మొదలుపెట్టింది. అశోక్ మల్హోత్ర, జతిన్ పరంజేప్, సులక్షణ నాయక్ లు మెంబెర్ లు గా ఉన్న క్రికెట్ అడ్వైజరీ కమిటీ, రమేశ్ పవార్ ను హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పించాలని బీసీసీఐకి సూచించింది. సీఏసీ సూచన మేరకు బీసీసీఐ అతడిని ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే.. పవార్ తో పూర్తిగా సంబంధం తెంచుకోకుండా.. నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో స్పిన్ బౌలింగ్ కోచ్ గా అవకాశం కల్పించింది. ఇకమీదట అతడు ఎన్సీఏలో యువ క్రికెటర్లకు స్పిన్ బౌలింగ్ పాఠాలు భోదించనున్నాడు. అతని స్థానంలో భాద్యతలు చేపట్టేది ఎవరన్నది బీసీసీఐ ప్రకటన చేయలేదు.
#BCCI #CAC #AshokMalhotra #JatinParanjape
Ashok Malhotra, Jatin Paranjape appointed @BCCI Cricket Advisory Committee members
READ: https://t.co/QSsmirh8MN pic.twitter.com/ssr2dsQEjg
— TOI Sports (@toisports) December 1, 2022
అయితే.. ప్రస్తుతం ఎన్సీఏలో బ్యాటింగ్ కోచ్ గా సేవలందిస్తున్న మాజీ క్రికెటర్ హృషికేశ్ కనిత్కర్ ను భారత మహిళల జట్టుకు బ్యాటింగ్ కోచ్ గా నియమించింది బీసీసీఐ. కనిత్కర్.. త్వరలో భారత జట్టు ఆస్ట్రేలియాతో ఆడబోయే టీ20 సిరీస్ నుంచే బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంది. ఇదిలావుండగా.. సీఏసీ.. త్వరలోనే భారత పురుషుల జట్టుకు సంబంధించి కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. టీ20కి కొత్త కెప్టెన్, కొత్త హెడ్ కోచ్ లను నియమించే దిశగా అడుగులు వేస్తోందట. బహుశా ఐపీఎల్ మినీ వేలం తర్వాత ఆ మార్పులు చూడొచ్చేమో. ఇవేకాకుండా.. రాణించని ఆటగాళ్లను సాగనంపే పనులు కూడా పూర్తి చేయాలని నెటిజన్స్ సూచిస్తున్నారు.
India Cricket Overhaul: BCCI & New CAC make first
BIG move, Ramesh Powar appointed India’s SPIN-BOWLING coach at NCA,
Hrishikesh Kanitkar to coach women’s team, Follow LIVE
Updates https://t.co/nY5kVGyQdk— Sarang Pokhare (@sarangpokhare4u) December 6, 2022
🚨 NEWS 🚨: Hrishikesh Kanitkar appointed as Batting Coach – Team India (Senior Women), Ramesh Powar to join NCA
More Details 🔽https://t.co/u3Agagamdd
— BCCI (@BCCI) December 6, 2022