ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా ప్రదర్శనపై బీసీసీఐ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. వరల్డ్ కప్ వైఫల్యాలపై పోస్టుమార్టంకు బీసీసీఐ కొత్త అధ్యక్షుడు రోజర్ బిన్నీ సిద్ధమైనట్లు సమాచారం. అందులో భాగంగా చేతన్ శర్మ నేతృత్యంలోని నేషనల్ సెలక్షన్ కమిటీ మొత్తాన్ని ఇంటికి పంపేశారు. కొత్త కమిటీ కోసం దరఖాస్తులు కూడా ఆహ్వానించారు. మరికొన్ని రోజుల్లోనే ఐదుగురు సభ్యులతో కూడిన కొత్త సెలెక్షన్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. అయితే.. వరల్డ్ కప్ ఫెల్యూర్‌పై బీసీసీఐ మరిన్ని చర్చలు తీసుకోనున్నట్లు విశ్వసనీయ సమాచారం. కొత్త సెలెక్షన్ కమిటీ సెట్ కాగానే.. మొదట టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై వేటు పడే అవకాశం ఉన్నట్లు బోర్డు పెద్దలు వెల్లడిస్తున్నారు.
అంతర్జాతీయంగా బిజీ షెడ్యూల్స్ ఉన్న నేపథ్యంలో వన్డే, టెస్టులు ఒక కెప్టెన్, టీ20 లాంటి ఫాస్ట్ ఫుడ్ ఫార్మాట్‌కు మరో కెప్టెన్ ఉండేలా బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే కొత్త సెలెక్షన్ కమిటీ రాగానే… మొదట రోహిత్ శర్మను టీ20 కెప్టెన్‌గా తొలగించి, అతని స్థానంలో హార్దిక్ పాండ్యాను టీ20 జట్టుకు రెగ్యులర్ కెప్టెన్‌గా కొనసాగించనున్నారు. అయితే.. రోహిత్ శర్మను వన్డే, టెస్టు జట్టు కెప్టెన్‌గా కొనసాగిస్తారా? లేదా? అనే విషయంపై కూడా స్పష్టత లేదంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే.. రోహిత్ శర్మను టీ20 కెప్టెన్‌గా తప్పిస్తే.. టీమిండియాలో భారీ మార్పుకు బీసీసీఐ శ్రీకారం చుట్టినట్టే. ఇప్పటికే విరాట్ కోహ్లీ లాంటి ఆటగాడిని వన్డే కెప్టెన్‌గా తొలగించి గంగూలీ పెద్ద తప్పు చేశాడనే విమర్శలు ఇప్పటికీ ఉన్నాయి.
కాగా.. టీ20 వరల్డ్ కప్ 2022 కోసం ఒక ప్రణాళిక ప్రకారం జట్టును ఎంపిక చేయడంలో సెలెక్టర్లు విఫలం అయినట్లు బీసీసీఐ చైర్మన్ బిన్నీ భావించి.. వారిని తొలగించారు. అయితే.. టీ20లకు ఎక్కువగా యువ క్రికెటర్లను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే రోహిత్ శర్మను కెప్టెన్‌గా తొలగిస్తూ.. ఆ బాధ్యతలు పాండ్యాకు అప్పగిస్తున్నట్లు తెలుస్తుంది. కాగా.. వరల్డ్ కప్‌లో సూపర్ 12లో పాకిస్థాన్ పై విజయం మినహా పెద్ద గొప్ప ప్రదర్శన చేయని టీమిండియా.. సెమీస్‌లో ఇంగ్లండ్ బ్యాటింగ్ ముందు చేతులెత్తేసింది. ఒక్కటంటే ఒక్క వికెట్ తీయకుండా.. 170 పరుగులు సమర్పించుకుని భారత బౌలర్లు అత్యంత దారుణంగా విఫలం అయ్యారు. ఈ ఓటమితో టీమిండియా ఆటగాళ్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. మరి కొత్త సెలెక్షన్ కమిటీ వచ్చిన తర్వాత అయినా టీమిండియాలో మార్పు వస్తుందో లేదో చూడాలి.
Hardik Pandya could be the new T20I skipper after the appointment of new selectors.#HardikPandya #BCCI #IndianCricketTeam #ChetanSharma https://t.co/4Y3zJlBTX4
— CricTracker (@Cricketracker) November 19, 2022