భారత క్రికెట్ బోర్డు గత కొంత కాలంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ లో వైఫల్యాల తర్వాత బీసీసీఐపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సరైన ఆటగాళ్లను ఎంపిక చేయలేదని, నైపుణ్యం కలిగిన ప్లేయర్స్ ను జట్టులోకి తీసుకోకుండా విఫలం అవుతున్న ఆటగాళ్లను ఎందుకు తీసుకుంటున్నారంటూ మాజీలతో పాటుగా సగటు క్రికెట్ అభిమానులు మండిపడ్డారు. దాంతో బీసీసీఐ కొత్త సెలక్షన్ కమిటీని నియమించడానికి సిద్దమైంది. ఇప్పటికే పాత సెలెక్షన్ కమిటీని రద్దు చేసింది. ఈ సమస్యలు చాలవు అన్నట్లుగా తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీకి నోటీసులు అందించింది BCCI ఎథిక్స్ కమిటి. దానికి కారణం ఆమె కోడలు మయంతి లాంగర్.
సౌరవ్ గంగూలీ తర్వాత BCCI కి అధ్యక్షుడు ఎవరు అవుతారా అని ప్రపంచ దేశాల క్రికెట్ బోర్డులన్ని ఆసక్తిగా ఎదురుచూశాయి. దానికి కారణం వరల్డ్ రిచెస్ట్ క్రికెట్ బోర్డుగా బీసీసీఐ ఉండటమే. ఇక అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. టీమిండియా మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ బీసీసీఐ అధ్యక్ష పీఠాన్ని అలంకరించాడు. అతడు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి బోర్డు అనేక సమస్యలను ఎదుర్కొంటుంది. తాజాగా మరో సమస్యలో చిక్కుకున్నాడు అధ్యక్షుడు రోజర్ బిన్నీ. తాజాగా బిన్నీ పరస్పర విరుద్ద ప్రయోజనాల (కాన్ ఫ్టిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్) ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. వివరాల్లోకి వెళితే.. రోజర్ బిన్నీ కోడలు, స్టువర్ట్ బిన్నీ భార్య అయిన మయంతి లాంగర్ ప్రస్తుతం స్టార్ స్పోర్ట్స్ ఛానల్ లో పనిచేస్తోంది.
అయితే భారత్ లో బీసీసీఐ మ్యాచ్ ల ప్రసార హక్కులు స్టార్ స్పోర్ట్స్ కే ఉన్నాయి. దాంతో నిబంధనల ప్రకారం అధ్యక్షుడి కుటుంబానికి చెందిన ఫ్యామిలీ సభ్యులు బోర్డు కు సంబంధించి ఎలాంటి పదవుల్లో, ఉద్యోగాల్లో ఉండరాదు. ఇదే విషయాన్ని మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘానికి చెందిన సభ్యుడు సంజీవ్ గుప్తా.. బీసీసీఐ ఎథిక్స్ ఆఫీసర్ వినీత్ శరణ్ కు ఫిర్యాదు చేశాడు. దాంతో ఎథిక్స్ కమిటీ డిసెంబర్ 20వ తారీఖు లోగా ఈ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని నోటీసులు పంపింది. మయంతి లాంగర్ పనిచేయడం కాన్ ఫ్టిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్ కిందకే వస్తుందని సంజీవ్ గుప్తా తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇప్పటికే సెలెక్షన్ కమిటీ గురించి తర్జనభర్జన పడుతుంటే మరో సమస్య రోజర్ బిన్నీ నెత్తిన పడింది.
#RogerBinny #BCCI @BCCI serves conflict of interest notice to its president Roger Binny
READ: https://t.co/SnBPor4RqN pic.twitter.com/8G5NGcJs8f
— TOI Sports (@toisports) November 29, 2022
#BCCI ethics officer #VineetSaran has asked #RogerBinny to file a written response by December 20 against the conflict of interest allegations levelled against him, according to new agency PTIhttps://t.co/KnYYvjmqFW
— CricketNDTV (@CricketNDTV) November 29, 2022