భారత క్రికెట్ బోర్డు గత కొంత కాలంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ లో వైఫల్యాల తర్వాత బీసీసీఐపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సరైన ఆటగాళ్లను ఎంపిక చేయలేదని, నైపుణ్యం కలిగిన ప్లేయర్స్ ను జట్టులోకి తీసుకోకుండా విఫలం అవుతున్న ఆటగాళ్లను ఎందుకు తీసుకుంటున్నారంటూ మాజీలతో పాటుగా సగటు క్రికెట్ అభిమానులు మండిపడ్డారు. దాంతో బీసీసీఐ కొత్త సెలక్షన్ కమిటీని నియమించడానికి సిద్దమైంది. ఇప్పటికే పాత సెలెక్షన్ కమిటీని రద్దు చేసింది. […]