ఒక దశాబ్దకాలం పాటు తమ పాటలతో కుర్రకారును హోరెత్తించారు రాజ్- కోటిల ద్వయం . టాప్ హీరోలు కూడా వీరితో సినిమాలు చేసేందుకు వేచి చూశారంటే అతిశయోక్తి లేదు. అయితే తర్వాత విబేధాలు వచ్చి రాజ్ , కోటిలు విడిపోయారు. వీరిలో కోటి తర్వాత సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్‌గా కొనసాగారు. అయితే ఇప్పుడు ఆయనకు అరుదైన గౌరవం దక్కింది.
సంగీత దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్న చక్రి ఊబకాయ సమస్యతో డిసెంబర్ 2014లో మరణించారు. అయితే ఆయన మరణంపై అనుమానం ఉందని చక్రి కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయనది సహజ మరణం కాదని, దీని వెనుక కుట్ర ఉందని చక్రి సోదరుడు మహిత్ నారాయణ్ అన్నారు.
దివంగత సంగీత దర్శకుడు చక్రి సోదరుడు.. పరారీ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేశారు. తాజాగా ఆయన ఓ యూట్యూబ్ చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..
పరిచయం అవసరం లేని పేరు ఏఆర్ రెహమాన్. సంగీత సామ్రాట్‌గా రెహమాన్ ప్రస్థానం అమోఘం, అపూర్వం, అనంతం, అఖండం. ప్రాజెక్ట్ ఏదైనా మొదటి ప్రాజెక్ట్ అన్నట్టుగా పనిచేస్తారు. అందుకే ప్రతీ ఆల్బమ్ సంచలన విజయాన్ని నమోదు చేస్తుంది. మణిరత్నం డైరెక్షన్‌లో వచ్చిన రోజా సినిమాతో సంగీత దర్శకుడిగా అడుగుపెట్టిన రెహమాన్ మొదటి సినిమాతోనే సత్తా చాటి ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. తనదైన సంగీతతో ప్రేక్షక లోకాన్ని ఉర్రూతలూగించిన రెహమాన్ రెండు ఆస్కార్ అవార్డులు […]
ఈ ఏడాది సినీ పరిశ్రమకు అస్సలు కలిసి రావడం లేదు. సినీ ప్రముఖులు, దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్స్‌తో పాటు పాటల రచయతలు కన్నుమూశారు. కొంత మంది అనారోగ్యంతో కన్నుమూస్తే.. బలవన్మరణంతో కొంతమంది.. మరికొంత మంది హఠాన్మరణం చెందారు. తాజాగా తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. సంగీత దర్శకుడు ప్రమోద్ కుమార్ పరిసర్ల గుండెపోటు కారణంగా కన్నుమూశారు. తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాలకు సౌండ్ మిక్సింగ్ ఇంజనీర్ పని చేసి.. ఇటీవల సంగీత దర్శకుడిగా […]
సినీ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ అందించి నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఇళయరాజ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. గత కొంత కాలంగా ఆయన పలు వివాదాలు ఎదుర్కొంటున్నారు. సంగీత ప్రపంచంలో ఆయనను రారాజుగా పొగిడేవారు. ఆ మద్య ప్రధాని మోదీని భారత రాజ్యంగ నిర్మాతతో పోల్చిన విషయం తెలిసిందే. దీనిపై దేశ వ్యాప్తంగా ఆయనపై రక రకాలుగా కామెంట్స్ చేశారు. ఇళయ రాజాకు జిఎస్టి చెన్నై శాఖ అధికారులు నోటీసులు […]
సంగీత ప్రపంచంలో మరో విషాదం చోటు చేసుకుంది. అమెరికాకు చెందిన ప్రముఖ మ్యూజిక్ బ్యాండ్ ‘టూ క్లోస్ టు టచ్’ రాక్ బ్యాండ్ ద్వారా పాపులారిటీ దక్కించుకున్న సింగర్ కీటన్ పియర్స్ హఠాత్తుగా మరణించారు. ఈ విషయాన్ని ‘టూ క్లోస్ టు టచ్’ రాక్ బ్యాండ్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ప్రకటించింది. కీటన్ కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని.. ఆ కారణంగా అతను తుదిశ్వాస విడిచినట్లు అతని స్నేహితులు తెలిపారు. సింగర్ కీటన్ మరణ వార్త […]
తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. రోజుల వ్యవధిలోనే ప్రముఖులు కన్ను మూస్తున్నారు. రెండు రోజుల క్రితం ముత్యాలముగ్గు ఫేమ్ వెంకటేశ్వర రావు మృతి చెందారు. ఆ విషాదం నుంచి కోలుకోకముందే మరో ప్రముఖుడు కన్ను మూశారు. ఆ వివరాలు.. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్పీ ఈశ్వర్‌రావు అనారోగ్యంతో చెన్నైలో కన్నుమూశారు. 63 ఏళ్ళ వయసులో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించారు. ఈశ్వర్ రావు ఒకప్పటి […]
ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పి లహిరి కన్నుమూశారు. ఆయన గత కొంతగాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తన డిస్కొ మ్యూడిక్ తో భారతీయ సినీ పరిశ్రమను ఒక ఊపు ఊపేశారు. అయితే తాజాగా లహిరి మరణం నేపథ్యంలో ఆయన పాటలు, సంగీతం, వ్యక్తిగత జీవిత విశేషాలను అభిమానులను మరోసారి గుర్తుచేసుకుంటున్నారు. ఇందులో భాగంగా బప్పి లహిరి అనగానే మెడలో బంగారంతో అందరికి గుర్తుకు వస్తుంది. […]
ఒక చిత్రానికి స్క్రీన్ ప్లే… దర్శకత్వం, నటీ నటుల పర్ఫామెన్స్ ఎంత ముఖ్యమో అంతకన్నా ఎక్కువ ప్రాణం పోసేది సంగీతం. మ్యూజికల్ హిట్ సాధించిందీ అంటే పది కాలల పాటు ఆ చిత్రం గురించి చెప్పుకుంటారు. అలాంటి చిత్రాలు తెలుగు తెరపై ఎన్నో వచ్చాయి. ఎంతో మంది సంగీత దర్శకులు తెలుగు తెరపై చెరగని ముద్ర వేశారు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఎస్ ఎస్ థమన్ ఒకరు. సంగీత […]