పరిచయం అవసరం లేని పేరు ఏఆర్ రెహమాన్. సంగీత సామ్రాట్‌గా రెహమాన్ ప్రస్థానం అమోఘం, అపూర్వం, అనంతం, అఖండం. ప్రాజెక్ట్ ఏదైనా మొదటి ప్రాజెక్ట్ అన్నట్టుగా పనిచేస్తారు. అందుకే ప్రతీ ఆల్బమ్ సంచలన విజయాన్ని నమోదు చేస్తుంది. మణిరత్నం డైరెక్షన్‌లో వచ్చిన రోజా సినిమాతో సంగీత దర్శకుడిగా అడుగుపెట్టిన రెహమాన్ మొదటి సినిమాతోనే సత్తా చాటి ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. తనదైన సంగీతతో ప్రేక్షక లోకాన్ని ఉర్రూతలూగించిన రెహమాన్ రెండు ఆస్కార్ అవార్డులు సహా అనేక అవార్డులు దక్కించుకున్నారు. తమిళ, హిందీ, తెలుగు, ఇంగ్లీష్ భాష చిత్రాలకి అద్భుతమైన సంగీతం అందిస్తూ భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచ నలుదిక్కులకూ వ్యాపింపజేశారు.
మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ఏఆర్ రెహమాన్‌కు క్రేజ్ ఉంది. ఆయన కంపోజ్ చేసిన పాటలు వింటే ఇప్పటికీ తనువు మర్చిపోయి మైకంలో తేలిపోయే అభిమానులు ఉన్నారు. అలాంటి ఏఆర్ రెహమాన్‌కు అరుదైన గౌరవం దక్కింది. అది కూడా కెనడా దేశంలో. కెనడా వాసులకి ఏఆర్ రెహమాన్ అంటే విపరీతమైన పిచ్చి. అది ఎంతలా అంటే తమ వీధులకు ఏఆర్ రెహమాన్ పేరు పెట్టేంత. అవును కెనడాలోని మార్ఖం అనే నగరంలోని రెండు వీధులకు ఏఆర్ రెహమాన్ పేరు పెట్టారు. 2013లో కెనడాలోని మార్ఖంలో ఒక వీధికి ‘అల్లా రఖా రెహమాన్’ అని పేరు పెట్టగా.. తాజాగా కెనడాలోని మరో వీధికి ఏఆర్ రెహమాన్ పేరు పెట్టడం విశేషం.
మార్ఖం సిటీలోని ‘ఏఆర్ రెహమాన్’ వీధి బోర్డు దగ్గర నిలబడి కొంతమంది ప్రముఖులతో కలిసి ఏఆర్ రెహమాన్ దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోసారి కెనడాలో ఏఆర్ రెహమాన్‌కు అరుదైన గౌరవం దక్కడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యం వహించిన కోబ్రా, పొన్నియిన్ సెల్వన్, వెందు తనిందుదు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. మరి ఏఆర్ రెహమాన్‌కు మరోసారి అరుదైన గౌరవం దక్కడంపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.
இசையமைப்பாளர் ஏ.ஆர்.ரஹ்மானை கௌரவிக்கும் வகையில், கனடாவின் Markham என்ற நகரத்தில் உள்ள ஒரு தெருவிற்கு அவரது பெயரை வைத்துள்ளனர்#SunNews | #Canada | @arrahman pic.twitter.com/RZtI9BjJyf
— Sun News (@sunnewstamil) August 28, 2022